ప్రస్తుతం సినీ ప్రేక్షకులు జపిస్తున్న మంత్రం అవతార్-2. ఏ థియేటర్లో చూసిన ఈ బొమ్మే. జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌ను చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. రిలీజ్ రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. టాక్‌తో సంబంధంలేకుండా భారీ వసూళ్ళను సాధిస్తుంది. నాలుగు రోజులు బాక్సాఫీస్ కళకళలాడుతుంది. ఇక ఈ సినిమా మేనియా ఇప్పట్లో తగ్గేలా లేదు. అయినా గానీ వచ్చే వారం ఈ సినిమాకు పోటీగా మూడు డబ్బింగ్ సినిమాలు, రెండు స్ట్రేయిట్ తెలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు ఈ వారం ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచడానికి ఓటీటీలోనూ పలు సినిమాలు సిద్ధమయ్యాయి. ఇక ఈ వారం ఓటీటీ/థియేటర్లలో రిలీజైయ్యే సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.
లాఠీ:
విశాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విశాల్ కానిస్టేబుల్ పాత్రలో నటించాడు. ఏ.వినోద్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశాల్‌కు జోడీగా సునయిన నటించింది.
కనెక్ట్:
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ఈ హర్రర్ థ్రిల్లర్ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. మయూరి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన శరవణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక నయన్-శరవణన్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ధమాకా:
మాస్‌మహారాజ రవితేజ ద్విపాత్రాభినయం పోషిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. శ్రీలీల హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.
18పేజీస్:
నిఖిల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. కుమారి 21ఎఫ్ ఫేం పల్నాటీ సూర్య ప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు కథ అందించడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు లేటెస్ట్గా రిలీజైన ట్రైలర్ సినిమాపై విపరీతమైన ఆసక్తిని క్రియేట్ చేసింది. నిఖిల్‌కు జోడీగా అనుపమ నటించింది.
సర్కస్:
రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకుగా డిసెంబర్ 23న విడుదల కానుంది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవలే రిలీజైన ట్రైలర్‌కు అనూహ్య స్పందన వచ్చింది. ఈ చిత్రంలో పూజాహెగ్డే, జాక్వలీన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటించారు.
ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు:
ఆహా:
మసూద(తెలుగు)-డిసెంబర్-21
అమెజాన్ ప్రైమ్:
టామ్ క్లాన్సీస్ జాక్ ర్యాన్(వెబ్ సిరీస్)- డిసెంబర్ 21
నెట్‌ఫ్లిక్స్:
జయ జయ జయ జయహే(మలయాళం)-డిసెంబర్ 22
ఎమిలి ఇన్ ప్యారిస్(వెబ్ సిరీస్)-డిసెంబర్ 21
ఎలైస్ ఇన్ బోర్డర్ లాండ్(హాలీవుడ్)-డిసెంబర్ 22
గ్లాస్ అనియన్: నైవ్స్ అవుట్ మిస్టరీ(హాలీవుడ్)-డిసెంబర్ 23
ది ఫ్యాబులెస్(కొరియన్ సిరీస్)-డిసెంబర్ 23
ద టీచర్(మలయాళం)-డిసెంబర్ 23
జీ-5:
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం(తెలుగు)- డిసెంబర్ 23
షడ్యంత్ర( హిందీ వెబ్ సిరీస్)-డిసెంబర్ 18
పిచర్స్(హిందీ వెబ్ సిరీస్)-డిసెంబర్ 23
డిస్నీ+హాట్‌స్టార్:
బిగ్ బెట్(కొరియన్ సిరీస్)-డిసెంబర్ 21.