Vijay Devarakonda | టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ఈ రౌడీ హీరోకు ఫాలోయింగ్ ఎక్కువ అని తెలిసిందే. ముఖ్యంగా యువత అయితే విజయ్ దేవరకొండ అంటే పడి చస్తారు. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం VD12 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. సితార బ్యానర్లో వస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. నాగవంశీ నిర్మాతగా వ్యవహారిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్లో జరుపుకుంటుంది. అయితే షూటింగ్ గ్యాప్లో తన అభిమానులను కలుసుకోవడానికి విజయ్ ఒక స్పెషల్ మీట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ స్పెషల్ మీట్లో వైజాగ్ లో ఉన్న తన అభిమానులను స్వయంగా వెళ్లి కలిసాడు విజయ్. వైజాగ్ విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఫ్యాన్ మీట్ జరుగగా.. వచ్చిన అభిమానులందరిని కలిసి వారితో ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు విజయ్. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
The Man 🖤🖤#VijayDeverakonda pic.twitter.com/n7lqpUO9LK
— THE Pavan Kumar Suman⭐ (@cult1_rowdy) May 23, 2024
The Man 🖤🖤#VijayDeverakonda pic.twitter.com/n7lqpUO9LK
— THE Pavan Kumar Suman⭐ (@cult1_rowdy) May 23, 2024