Madonne Ashwin | ‘తంగలాన్’ సినిమాతో హిట్ అందుకున్న చియన్ విక్రమ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే అరుణ్ కుమార్ దర్శకత్వంలో ‘వీర ధీర శూరన్’ సినిమా చేస్తున్న ఈ నటుడు తన 63వ సినిమాకి క్రేజీ దర్శకుడిని లైన్లో పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ‘మండేలా'(Mandela), శివకార్తికేయన్ నటించిన మావీరన్ (మహావీరుడు) (Maha Veerudu) సినిమాలతో హిట్లు అందుకున్న దర్శకుడు మడోన్నే అశ్విన్(Madonne Ashwin) దర్శకత్వంలో విక్రమ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను శాంతి టాకీస్ నిర్మించనున్నట్లు టాక్. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
‘వీర ధీర శూరన్’ సినిమా విషయానికి వస్తే.. విక్రమ్ కథానాయకుడిగా నటిస్తుండగా.. దుషార విజయన్ హీరోయిన్గా నటిస్తుంది. ఎస్జే సూర్య విలన్‌గా నటించనున్నాడు. రీసెంట్గా ఈ సినిమా టీజర్ విడుదలవ్వగా.. అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ టీజర్లో విక్రమ్ కారు దిగుతున్న దృశ్యం సూపర్ మాస్ అని అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. టీజర్ కూడా 10 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
#ChiyaanVikram & #MadonneAshwin Project is Confirmed..✅🔥 To be Produced by Shanthi Talkies (Maaveeran)..⭐ Gonna be a Very Interesting project to look forward to..💯 Chiyaan on the Right Track..🤝 pic.twitter.com/LrbrGtFc2G
— Laxmi Kanth (@iammoviebuff007) December 11, 2024