రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి లీడ్‌రోల్స్ చేసిన చిత్రం ‘చిట్టి పొట్టి’. భాస్కర్ యాదవ్ స్వీయదర్శకత్వంలో నిర్మించారు. సిస్టర్ సెంటిమెంట్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటైర్టెనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 3న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. అతిథిగా విచ్చేసిన కేర్ గ్రూప్స్ చైర్మన్ ఏ.ఎం.రెడ్డి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే సినిమా ఇది. ప్రతి ఒక్క కుటుంబానికీ కనెక్టయ్యే కథతో ఈ సినిమా చేశాం. ఒక ఆడపిల్ల చెల్లెలుగా.. ఆ తర్వాత మేనత్తగా.. ఆఖరికి బామ్మగా మారే ప్రయాణమే ఈ సినిమా.’ అని దర్శక, నిర్మాత భాస్కర్ యాదవ్ చెప్పారు. ఇంకా హీరోహీరోయిన్లు రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: మల్హర్ భట్ జోషి, సంగీతం: శ్రీ వెంకట్, నిర్మాణం: భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా.