టాలీవుడ్‌కి చెందిన చిత్రపురి కాలనీ నూతన ప్రాజెక్ట్, భవిష్యత్ కార్యాచరణ వివరాలను సంస్థ సభ్యులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. త్వరలో ప్రాజెక్ట్‌కి సంబంధించిన భూమి పూజ ఉంటుందని సంస్థ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన బ్రోచర్‌ని విడుదల చేశారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా పరిశ్రమలో కార్మికులందరికీ ఇళ్లు అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని వల్లభనేని అనిల్‌కుమార్ పేర్కొన్నారు. చిత్రపురి కాలనీ భవిష్యత్‌లో ఓ ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని ఆయన నమ్మకం వెలిబుచ్చారు.