Chithha Movie | తెలుగు తెరపై బాయ్స్ (Boys), నువ్వొస్తానంటే నేనొద్దంటాన, బొమ్మరిల్లు (Bommarillu), ఓయ్ (OYE), వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కథానాయకుడు సిద్ధార్థ్ (Siddarth). ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా చిత్తా (Chithha). ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ (Red Giant Movies), ఈటాకీ (Eataki entertainments) ఎంటర్టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సేతుపతి (Sethupathy) సినిమా ఫేమ్ అరుణ్ కుమార్ (Arun Kumar) దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీని సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా.. డి-గ్లామర్ రోల్లో పల్లెటూరి వ్యక్తిగా కనిపిస్తున్నా సిద్ధార్థ్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇక ప్రస్తుతం పోస్టు ప్రోడక్షన్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రమోషన్స్ షూరు చేయనుంది.
Bringing to you #Siddharth’s #Chithha, in cinemas on Sep 28th.
A #RedGiantMovies release. #ChithhaFromSep28@Etaki_official #SUArunkumar @dhibuofficial @composer_vishal @RedGiantMovies_ @balaji_dop137 @iameditorsuresh#CSBalachandar @anilandbhanu @hariprasad4091… pic.twitter.com/rUK4Yc15Tn
— Red Giant Movies (@RedGiantMovies_) August 20, 2023
ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 28న ప్రభాస్ సలార్, వివేక్ అగ్నిహోత్రి ది వ్యాక్సిన్ వార్ సినిమాలు కూడా రిలీజవుతున్నాయి. అయితే పెద్ద పెద్ద సినిమాలే సలార్ దరిదాపుల్లో రావడానికి భయపడుతుంటే.. ది వాక్సిన్ వార్, చిత్తా సినిమాలు ఏకంగా సలార్ సినిమాకే పోటీగా వస్తున్నాయి. ఇప్పటికే సలార్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు మాములుగా లేవు. ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుందా అని సౌత్ ప్రేక్షకులే కాదు ఉత్తరాది ప్రేక్షకులు సైతం అమితాసక్తితో ఉన్నారు. ఈ సినిమాకు ఏ మాత్రం పాజిటీవ్ టాక్ వచ్చినా.. దాని ప్రభాసం కనీసం రెండు, మూడు వారాలైనా ఉంటుంది.