Chiru – Mahesh | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు 50వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఆయన బర్త్ డే సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు మహేష్ నటించిన అతడు చిత్రాన్ని కూడా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు మహేష్ బర్త్ డే హంగామా రెండు తెలుగు రాష్ట్రాలలో ఓ రేంజ్లో నడుస్తుంది. ఇక మహేష్ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక శుభాకంక్షలు తెలిపారు. తన సోషల్ మీడియా వేదికగా మహేష్‌కి బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ..తెలుగు సినిమాకి గర్వకారణంగా నిలిచిన మీరు అసాధారణ ప్రతిభ, ఆకర్షించే గుణంతో అభిమానుల హృదయాలు కొల్లగొడుతున్నారు. సంవత్సరం సంవత్సరానికి మరింత యవ్వనంగా మారుతున్నారు. ఈ ఏడాది కూడా మీకు సంతోషం, విజయంతో పాటు ఆనందకరమైన క్షణాలతో కూడిన సంవత్సరం కావాలని ఆశిస్తున్నా అంటూ చిరు పేర్కొన్నారు.
మహేష్ బాబు కెరీర్ విషయానికి వస్తే ఆయన ఇప్పటి వరకు 28 సినిమాలు చేశారు. నటుడిగా 8 నంది అవార్డులు, 5 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సహా ఎన్నో గౌరవాలు అందుకున్నారు. ఉత్తమ నటుడిగా నిలిచిన చిత్రాల్లో ‘రాజకుమారుడు’, ‘మురారి’, ‘అర్జున్’, ‘నిజం’, ‘దూకుడు’, ‘శ్రీమంతుడు’ వంటి చిత్రాలు ఉన్నాయి.తన సంపాదనలో 30 శాతం సామాజిక సేవకు కేటాయించడమే కాక, రెండు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఆపరేషన్లు చేయించి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. తన మానవత్వంతో ఎంతో మంది అభిమానుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించారు.
24 ఏళ్ల వయసులో ‘రాజకుమారుడు’ (1999) చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. డెబ్యూతోనే విమర్శకుల ప్రశంసలతో పాటుగా, బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించారు. ఉత్తమ తొలి చిత్రం హీరోగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత నుండి వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నారు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ తన అభిమానులకి మంచి వినోదం పంచుతున్నాడు. ‘పోకిరి’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన మహేష్ బాబు ఆ తర్వాత దూకుడు, ‘బిజినెస్ మ్యాన్’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘సర్కారు వారి పాట’, ‘గుంటూరు కారం’ వంటి బ్లాక్ బస్టర్లు సాధించారు. ప్రస్తుతం ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ‘SSMB 29’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు.
Happy Happy 50th, my dear SSMB @urstrulyMahesh !💐🤗
You are the pride of Telugu Cinema, destined to conquer the beyond!
You seem to grow younger with every passing year!Wishing you a wonderful year ahead and many, many happy returns! 💐
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 9, 2025