స్వయంకృషి, స్వీయ ప్రతిభను తన కెరీర్ కి పునాది రాళ్లుగా వేసుకొని టాలీవుడ్ మెగాస్టార్ గా అవతారం ఎత్తారు చిరంజీవి. ఎన్నో కష్ట నష్టాలను దాటుకుంటూ ఈ స్థాయికి వచ్చిన చిరంజీవి నటుడిగానే కాదు మంచి మానవత్వం ఉన్న మనిషిగా అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే 1978 సెప్టెంబర్ 22న చిరంజీవి సిల్వర్ స్ర్కీన్ కు పరిచయం అయ్యారు.
22Aug నేను పుట్టినరోజైతే 22Sept నటుడిగా నేను పుట్టినరోజు.కళామతల్లి నన్ను అక్కున చేర్చుకున్న రోజు.మీ అందరికి నన్ను నటుడిగా పరిచయంచేసి మీ ఆశీస్సులు పొందినరోజు.నేను మరిచిపోలేనిరోజు.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2021
Feel humbled & grateful for the invaluable❤️of lakhs of my bro’s & sisters this day made possible🙏
మెగాస్టార్ గా అభిమానుల నీరాజనాలు అందుకున్న చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదు విడుదలై నేటితో 43ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మధురమైన క్షణాలను గుర్తు చేసుకున్నారు చిరంజీవి. ఆగస్ట్ 22న నా పుట్టిన రోజైతే, సెప్టెంబర్ 22న నేను నటుడిగా పుట్టినరోజు. కళామ్మ తల్లి నన్ను అక్కున చేర్చుకున్న రోజు.మీ అందరికి నన్ను నటుడిగా పరిచయంచేసి మీ ఆశీస్సులు పొందినరోజు.నేను మరిచిపోలేనిరోజు.
ఎంతో మంది సోదర సోదరీమణుల వలన ఈ రోజు నేను మీ ముందు ఇలా ఉన్నాను అంటూ చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నారు. కెరీర్ లో 150కి పైగా చిత్రాలు చేసిన చిరంజీవి ప్రస్తుతం ఆచార్య, గాడ్ ఫాదర్ తో పాటు పలు చిత్రాలు చేస్తున్నాడు.