వకీల్ సాబ్ చిత్రం పవర్ ప్యాక్డ్ బ్లాక్టర్ సాధించడంతో చిత్ర బృందం ఆనందంలో ఉంది. నిన్నటి నుండి మూవీ విజయోత్సవాన్ని సంతోషంగా జరుపుకుంటున్న టీం ఈ రోజు చిరంజీవిని కలిసింది. వకీల్ సాబ్ చిత్ర దర్శకుడు శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజు కొద్ది సేపటి క్రితం చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనను మర్యాద పూర్వకంగా కలిసారు. దిల్ రాజు, శ్రీరామ్ వేణులని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు.
మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వగా, ఆయనను వెండితెరపై చూసేందుకు జనాలు చాలా ఉత్సాహం చూపించారు. గత రాత్రి చిరంజీవి తన తల్లి, కుటుంబ సభ్యులతో ఏఎంబీ మాల్‌కు వెళ్లి మరీ వకీల్ సాబ్ చిత్రాన్ని చూశారు. సినిమా చూశాక తన ట్విట్టర్ లో మూడేళ్ల తర్వాత కూడా పవన్ కళ్యాణ్‌లో అదే పవర్, అదే వేడి, అదే వాడి ఉందని ప్రశంసలు కురిపించారు చిరు.