Chiru- Bobby | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ ఎలిమెంట్స్‌తో కూడిన ‘విశ్వంభర’ ఇప్పటికే పూర్తయింది. ఇక మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇప్పుడే ఈ ప్రాజెక్టులతో తలమునకవుతున్న ఉన్న చిరు, తాజాగా మరో సినిమాను లైన్లో పెట్టారు. ఈసారి ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీ (KS రవీంద్ర)తో మరోసారి చేతులు కలిపారు. ఆగస్టు 22, చిరంజీవి 70వ జన్మదినం సందర్భంగా, చిరు-బాబీ కాంబోలో తెరకెక్కనున్న 158వ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ పోస్టర్లో నెత్తురోడిన గొడ్డలి, రక్తం చిందిన బ్యాక్‌డ్రాప్, వీటితో ఇది ఓ పవర్ఫుల్ యాక్షన్ మూవీగా ఉండబోతుందన్న సంకేతాలు అందాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూస్తుంటే చిరంజీవి వచ్చే ఏడాది మెగా అభిమానులకి అదిరిపోయే ఫీస్ట్ అందించనున్నాడని అర్ధమవుతుంది. 70 ఇయర్స్ లోకి ఎంటర్ అయిన మెగాస్టార్ చిరంజీవి సౌత్ సినిమాని.. స్పెషల్లీ తెలుగు సినిమాకి బిగ్ బాస్‌గా మారాడు. అందుకే ఎంతమంది హీరోలొచ్చినా.. మెగాస్టార్ మానియా మాత్రం అలానే ఉంటుంది. ఆయన సినిమాలకి ఆదరణ కూడా అంతే ఉంటుంది..
చిరంజీవి తో సినిమా చెయ్యాలని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పుడు ఆయనతో మన శంకరవరప్రసాద్ పండక్కి వస్తున్నారు సినిమా చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ లో నెక్ట్స్ లెవల్ లుక్ తో అదరగొట్టేశారు చిరంజీవి. అనిల్ రావిపూడి చిత్రంతోపాటు యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరు. ఒకే ఒక్క సినిమాచేసిన వశిష్టతో విశ్వంభర మూవీని ఎక్స్ పెరిమెంట్ గానే తీసుకుని చేస్తుండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి లాంటి సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్స్ తర్వాత హై ఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజవ్వబోతున్న సినిమా విశ్వంభర కాగా, ఈ మూవీ సమ్మర్లో రిలీజ్ కానుంది.