Rashmika | నేషనల్ క్రష్ రష్మిక ఈ మధ్య వరుస హిట్స్ కొడుతూ గోల్డెన్ లెగ్గా మారింది. ఆమె ఇటీవలి కాలంలో నటించిన అన్ని చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. రీసెంట్గా వచ్చిన కుబేర చిత్రం కూడా పెద్ద విజయం సాధించింది. కుబేర చిత్రం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కగా, ఇందులో ధనుష్, రష్మిక, నాగార్జున ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 20న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. డే బై డే టికెట్లు తెగుతూనే ఉన్నాయి. షోలు యాడ్ అవుతూనే ఉన్నాయి. స్క్రీన్ల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. తమిళంలో కంటే తెలుగులోనే ఈ చిత్రం ఎక్కువగా ఆడేస్తోంది. తెలుగు, ఓవర్సీస్లో మాత్రం కుబేర దుమ్ముదులిపేస్తోంది. ఇప్పటికే అరవై కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్టుగా సమాచారం.
‘కుబేరా’ చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్‌మీట్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల, నటులు నాగార్జున, ధనుష్‌లపై చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ ఈవెంట్లో రష్మిక మందన్నపై చిరంజీవి, నాగార్జున చేసిన కామెంట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నాగార్జున మాట్లాడుతూ, ‘‘శేఖర్ కమ్ముల ఇచ్చిన ఈ పాత్ర మొదట ఇబ్బందిగా అనిపించినా, నా పెర్ఫార్మెన్స్కి మంచి స్పందన రావడంతో చాలా సంతృప్తిగా ఉంది. ఆ క్రెడిట్ పూర్తిగా శేఖర్‌కే చెందుతుంది’’ అన్నారు. ఇక రష్మిక గురించి మాట్లాడుతూ.. ఆమెను అందరూ నేషనల్ క్రష్ అంటారు, ఇప్పటి నుండి నాకు క్రష్. క్షణక్షణం లో శ్రీదేవి ఎలా కనిపించారో, రష్మిక ఈ సినిమాలో అలా కనిపించింది అని వ్యాఖ్యానించారు. ఆయన మాటలపై రష్మిక ఎంతో సంతోషపడింది.
ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా రష్మికపై ప్రశంసలు కురిపిస్తూ ‘‘ నేను చెప్పాల్సింది నువ్వే చెప్పేశావ్ నాగ్. రష్మిక నేషనల్ క్రష్ మాత్రమే కాదు… నా క్రష్ కూడా. నీ మొదటి సినిమా ఈవెంట్‌కి కూడా నేనే గెస్ట్‌గా వచ్చాను. అప్పటి నుంచి నీ అభినయాన్ని గమనిస్తున్నా . సినిమా సినిమాకి నీ ఇమేజ్ పెరుగుతూనే ఉంది. కుబేరా చిత్రంలో రష్మిక మొదట్లో మోసపోయే సీన్ చూస్తే నాలో సౌందర్యని గుర్తుకు తెచ్చింది. క్లైమాక్స్ ముందు చిన్న పిల్లాడిని చేతిలో పట్టుకున్నప్పుడు నీ యాక్టింగ్ అసాధారణంగా ఉంది. స్క్రీన్ మీద నువ్వు కనిపిస్తే నీ కళ్లకే అట్టిపడిపోతాం. నువ్వు కళ్లతోనే నటించగలవు. నువ్వు నేషనల్ క్రష్ కాదు… ఇంటర్నేషనల్ క్రష్’’ అంటూ చిరంజీవి రష్మికపై ప్రశంసలు కురిపించారు.