మెగాస్టార్ అదిరిపోయే ఎంట్రీ?
చిరంజీవి సినిమాల్లో ఎంట్రీ సీన్‌కి ఉండే ప్రాధాన్యత అంతాఇంతా కాదు. వెండితెరపై మెగాస్టార్ కనిపించగానే.. థియేటర్లన్నీ అభిమానుల కేరింతలతో దద్దరిల్లిపోతుంటాయి. అందుకే.. ఈ సీక్వెన్స్ విషయంలో దర్శకులంతా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వుంటారు.
చిరంజీవి సినిమాల్లో ఎంట్రీ సీన్‌కి ఉండే ప్రాధాన్యత అంతాఇంతా కాదు. వెండితెరపై మెగాస్టార్ కనిపించగానే.. థియేటర్లన్నీ అభిమానుల కేరింతలతో దద్దరిల్లిపోతుంటాయి. అందుకే.. ఈ సీక్వెన్స్ విషయంలో దర్శకులంతా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వుంటారు. ప్రస్తుతం చేస్తున్న ‘కాకా’ సినిమాలో కూడా మెగాస్టార్ ఎంట్రీని అదిరిపోయే రేంజ్లో డిజైన్ చేశారట దర్శకుడు కేఎస్ రవీంద్ర(బాబీ). తాజాగా ఈ సీన్‌పై ఓ న్యూస్ బలంగా వినిపిస్తున్నది. ఓపెన్‌చేస్తే.. అదో స్కూల్.. వందలాదిమంది పిల్లలు చదువుకుంటున్న ఆ స్కూల్‌పై విద్రోహుల కళ్లు పడ్డాయి. స్కూల్‌ని నేలమట్టం చేయాలని బాంబ్ బ్లాస్ట్‌కి ప్లాన్ చేశారు.
ఒక్కసారిగా స్కూల్లో కలకలం మొదలైంది. ఈ కలామిటీ నేపథ్యంలో మెగాస్టార్ ఎంట్రీ ఇవ్వడం, పిల్లల్ని కాపాడుతుండగా ‘కాకా’ అనే టైటిల్ రివీల్ అవ్వడం జరుగుతుందట. కథకు, ‘కాకా’ అనే పేరుకీ నిర్వచనంలా ఈ సీక్వెన్స్‌ని డైరెక్టర్ బాబీ డిజైన్ చేసినట్టు తెలిసింది. డిసెంబర్ తొలివారం లోపు షూటింగ్ పూర్తి చేసి, జనవరి 13న సినిమాను విడుదల చేయనున్నట్టు నిర్మాత వెంకట్ కె.నారాయణ తెలిపారు. కుటుంబ భావోద్వేగాలే ప్రధానంగా సాగే ఈ సినిమాలో అనస్వర రాజన్ కీలక పాత్రధారి. నివేతా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, నిర్మాణం: కేవీఎన్ ప్రొడక్షన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

