Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా అడపాదడపా సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంటారు. సందర్భానుసారంగా ఆయన చేసే ట్వీట్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. అయితే ఈ రోజు ఉమెన్స్ డే కాగా, ఒక రోజు ముందుగానే చిరంజీవి తన సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. తన సోషల్ మీడియా పేజ్‌లో తన సతీమణి, అలనాటి అందాల హీరోయిన్స్‌తో కలిసి దిగిన పిక్ షేర్ చేశారు. దానికి కామెంట్‌గా తన నిజ జీవితాన్ని, సినీ జీవితాన్ని పంచుకుని విజయాన్ని అందించిన హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు.
చిరు షేర్ చేసిన ఫొటోలో ఆయన సతీమణి సురేఖతో పాటు ఆయనతో కలిసి నటించిన రాధిక, టబు, నదియా, జయసుధ, మీనా, సుహాసిని, కుష్బూ ఉన్నారు. ఈ పిక్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. చిరంజీవి తన కెరీర్లో ఎంతో మంది హీరోయిన్స్‌తో పని చేసిన కూడా ఎక్కడా ఆయన గురించి నెగెటివ్ వార్తలు రాలేదు. దటీజ్ మెగాస్టార్ చిరంజీవి అంటూ మెగాస్టార్‌ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక చిరంజీవి తన తల్లి, చెల్లెలు, తమ్ముడు నాగబాబుతో కలిసి మహిళా దినోత్సవం సందర్భంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రోమో ఇప్పటికే విడుదల కాగా, ఫుల్ వీడియో కూడా మరి కొద్ది నిమిషాలలో విడుదల కానుంది.
ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 నుంచి వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయన సినిమాలు మూస ధోరణిలో ఉంటున్నాయని కొందరు పెదవి విరిచారు. దీంతో ఇప్పుడు కొత్త కాన్సెప్ట్‌ని ఎంచుకున్నాడు. విశ్వంభర సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తరహాలోనే ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్ ముఖ్య పాత్రలలో కనిపించి సందడి చేయనున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. సంక్రాంతికి రావల్సిన ఈ సినిమా వీఎఫ్ఎక్స్ వలన వాయిదా పడుతూ వస్తుంది. ఆగస్ట్‌లో మూవీ రిలీజ్ ఉంటుందని సమాచారం.