Chiranjeevi | ఈరోజు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి తన సోషల్ మీడియాలో ఆసక్తికర ట్వీట్ చేశారు. తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ న సోషల్ మీడియా ఖాతాలో ఓ పాత ఫోటోను పంచుకున్నారు చిరంజీవి. ఆ ఫొటోలో చిరు, పవన్ ఇద్దరూ యంగ్ లుక్‌లో కనిపిస్తుండగా,ఈ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
“చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సేవలో నీవు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండిన జీవితంతో నువ్వు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు చిరు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ జనసేనానికి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా బర్త్‌డే విషెస్ తెలిపారు. పవన్ కల్యాణ్ మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలని చంద్రబాబు, వెండితెరపై అభిమానులను పవర్‌స్టార్‌గా అలరించారంటూ లోకేశ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన పీపుల్ స్టార్‌గా ఎదిగారని ప్రశంసించారు. ప్రజల కోసం తగ్గుతారు.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారని కొనియాడారు. ఇక, తనను సొంత సోదరుడి కంటే ఎక్కువగా అభిమానిస్తారని, అండగా నిలుస్తున్న పవన్ అన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ లోకేశ్ పోస్ట్ చేశారు.
ఇక చంద్రబాబు తన పోస్ట్‌లో.. అడుగడుగునా సామాన్యుడి పక్షం.. అణువణువునా సామాజిక స్పృహ.. మాటల్లో పదును.. చేతల్లో చేవ.. జన సైన్యానికి ధైర్యం.. మాటకి కట్టుబడే తత్వం.. రాజకీయాల్లో విలువలకు పట్టం.. స్పందించే హృదయం.. అన్ని కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానులు, ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలి. మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి. పాలనలో రాష్ట్రాభివృద్ధిలో మీ సహకారం మరువలేనిది. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు” అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా,
ప్రజా జీవితంలో జనసేనాని గా,
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు.ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం.
ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు… pic.twitter.com/13gaXFpWsG— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2025