అమితాబ్ బచ్చన్..ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.బాలీవుడ్ మెగాస్టార్‌గా, బిగ్ బీగా, షెహన్ షాగా, ఆరడుగుల బుల్లెట్లా ఇలా పలు పేర్లతో పిలవబడుతున్నాడు అమితాబ్. 1942 అక్టోబర్ 11న జన్మించిన అమితాబ్ నేడు 79వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అలహాబాద్, నైనిటాల్, ఢిల్లీలో అమితాబ్ బచ్చన్ విద్యాభ్యాసం సాగింది. తనయుల అభిలాష మేరకే వారిని ప్రోత్సహించాలని భావించారు హరివంశరాయ్. అమితాబ్ కు నటనలో ఆసక్తి ఉందని తెలిసి, తనకు తెలిసిన పృథ్వీరాజ్ కపూర్ నాటక సంస్థలో ఏదైనా అవకాశం ఉందేమో చూడమని కోరారు హరివంశరాయ్. అక్కడ లేదని చెప్పడంతో, అమితాబ్ బచ్చన్ ‘ఆల్ ఇండియా రేడియో’లో న్యూస్ రీడర్ పోస్ట్ కు వెళ్ళారు. ప్రముఖ బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్ తెరకెక్కించిన ‘భువన్ షోమే’ చిత్రంలో అమితాబ్ కు అవకాశం లభించింది. ఈ సినిమాతోనే తొలిసారి అమితాబ్ తెరపై కనిపించారు.
ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటిస్తూ మెప్పిస్తూ వచ్చిన అమితాబ్ ఇప్పటికీ నటుడిగా, హోస్ట్‌గా అలరిస్తూనే ఉన్నారు. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ తో పాటు చిత్రసీమలో ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సైతం అందించింది. ఈ రోజు బిగ్ బీ బర్త్ డే సందర్భంగా ఎంతో మంది ప్రముఖులు విషెస్ తెలియజేస్తున్నారు. చిరంజీవి సైరా సమయంలో అమితాబ్‌తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. నా పెద్ద సోదరుడు, గురువు అమితాబ్ బచ్చన్‌కి బర్త్ డే శుభాకాంక్షలు. అతనికి ఆరోగ్యం, ఆనందం, మరింత శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను అని చిరు పేర్కొన్నారు.
Wishing My Beloved Big Brother, My forever Guru, the One and Only Amit Ji @SrBachchan a very Happy Birthday. Many Many Happy Returns!! Health, Happiness and More Power to You Amit ji!!🙏 pic.twitter.com/h3Q5wyrB4n
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 11, 2021