కోవిడ్సెకండ్వేవ్ తో కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా ను నియంత్రించే దిశగా ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో లాక్డౌన్ ను అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు మానసికంగా చాలా ధైర్యంగా ఉండాలని వైద్యులు, సెలబ్రిటీలు సూచిస్తున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రజలకు ఓ సందేశాన్నిచ్చారు. కోవిడ్ కారణంగా మనం చాలా మంది ఆత్మీయులను కోల్పోవాల్సి వస్తోంది.
దయచేసి ప్రజలెవరూ లాక్డౌన్ టైంలో ఇంట్లో నుంచి బయటకు రావొద్దు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు. ఒకవేళ బయటకు వస్తే అందరూ డబుల్ మాస్క్ పెట్టుకోవాలి. ఎవరైతే ఇటీవలి కాలంలో కరోనా నుంచి కోలుకున్నారో..ప్లాస్మా దానం చేసి కొందరి ప్రాణాలనైనా కాపాడినవారు కావాలని కోరారు.
#Covid19IndiaHelp #StayHomeStaySafe #WearMask 😷 #DontPanic #GetVaccinated #DonatePlasmaSaveLives 🙏🙏
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 14, 2021
Lets #DefeatCorona 👊 pic.twitter.com/g1ysqxmPJR