Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) బంగార్రాజు ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. సుస్మిత కొణిదెల (Sushmita Konidela) హోం బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్పై ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. చిరంజీవి, త్రిష కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఈ ఇద్దరూ స్టాలిన్‌లో కలిసి నటించారు. గతంలో ఆచార్య సినిమాతో చిరు-త్రిష మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై మెరుబోతున్నారని వార్తలు రాగా.. సృజనాత్మక విభేదాల కారణంగా వర్కవుట్ కాలేదు. అయితే కళ్యాణ్ కృష్ణ (Kalyan Krishna) ఇటీవలే త్రిషను సంప్రదించగా.. సినిమాకు ఒకే చేసిందని ఇన్సైడ్ టాక్. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని తెలుస్తోంది. అయితే 17 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత కలిసి నటించబోతున్నారన్నమాట. కళ్యాణ్ కృష్ణ సినిమా తండ్రీకొడుకుల స్టోరీతో రాబోతుండగా.. చిరంజీవి తండ్రి పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది.
లేటెస్ట్ టాక్ ప్రకారం చిరంజీవి భార్య పాత్రలో త్రిష నటించనుంది. టైటిల్‌తోపాటు ఇతర వివరాలై త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది చిరు టీం. ఈ చిత్రం ఆగస్టులో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ ప్రాంఛైజీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంది త్రిష. ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తోన్న లియోలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ మూవీలో తన పాత్ర షూటింగ్ పూర్తి చేసింది త్రిష. మరోవైపు చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళాశంకర్ చిత్రంలో నటిస్తున్నాడు. భోళాశంకర్ ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాల్లో ఉంది.