Chiranjeevi | టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఇప్పటికే బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో నటిస్తున్న విశ్వంభర షూటింగ్ పూర్తి చేశాడు. విశ్వంభర మూవీ విడుదలకు సంబంధించిన కొత్త అప్డేట్ రావాల్సి ఉంది. మరోవైపు అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి నటిస్తున్న మెగా 157 ప్రాజెక్ట్ కూడా సెట్స్‌పైకి వెళ్లింది.
ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయినట్టు వార్తలు కూడా వచ్చాయి. తాజాగా చిరంజీవి -అనిల్ రావిపూడి టీం డెహ్రాడూన్‌లో ల్యాండ్ అయింది. మెగా 157 నెక్ట్స్ షెడ్యూల్ డెహ్రాడూన్‌లో ప్లాన్ చేసింది అనిల్ రావిపూడి టీం. ఎప్పుడో మొదలైన విశ్వంభర కోసం చాలా కాలంగా ఎదురుచూస్తూ నిరాశలో ఉన్న అభిమానులలో అనిల్ రావిపూడి జెట్‌స్పీడ్‌లో మెగా 157 మూవీ షూటింగ్ కొనసాగిస్తూ ఫుల్ జోష్ నింపుతున్నాడు.
ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిరంజీవి ఈ చిత్రంలో తన రియల్ లైఫ్ నేమ్ శంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. .
Megastar Chiranjeevi garu lands in Dehradun for the next exciting leg of #Mega157 shoot!🤩#ChiruAnil @KChiruTweets @AnilRavipudi @Shine_Screens @GoldBoxEnt pic.twitter.com/m1qgbeefrB
— BA Raju’s Team (@baraju_SuperHit) June 8, 2025
Tere Ishk Mein | ఎయిర్‌ఫోర్స్ అధికారిగా ధనుష్.. వైరలవుతున్న కొత్త సినిమా లుక్
Samantha | దర్శకుడు రాజ్ నిడుమోరుతో కలిసి దుబాయ్ వెకేషన్‌కు వెళ్లిన సమంత..?
Aamani | ఆ పని తప్పక చేయాల్సిందే.. తన వీక్నెస్ బయటపెట్టిన నటి ఆమని