Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది టెక్నీషియన్స్ చిరంజీవిని స్పూర్తిగా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన వారే. చాలా మంది దర్శకులు కూడా ఆయన ప్రేరణతోనే వచ్చి ఇప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్గా ఎదిగారు. అలాంటి వారిలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఒకరు.కుటుంబ కథలను హృద్యంగా తెరకెక్కించి ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతుంటారు శేఖర్ కమ్ముల. ఈ టాలెంటడ్ దర్శకుడు ప్రస్తుతం ధనుష్ తో కలిసి కుబేర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే శేఖర్ కమ్ముల ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని కలిసారు. ఆ సందర్భంగా కొన్ని స్పెషల్ మూమెంట్స్ షేర్ చేసుకున్నారు. కొన్ని జనరేషన్స్ ని ఇన్స్పైర్ చేసిన చిరంజీవి గారి దగ్గర 25 ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను అని చెప్పి మెగాస్టార్ ని కలిసిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు శేఖర్ కమ్ముల. అయితే తాజాగా చిరంజీవి శేఖర్ కమ్ములకు స్పెషల్ పెన్ గిఫ్ట్ ఇచ్చి ఆయనతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
మై డియర్ శేఖర్.. మీలాంటి ఒక అభిమాని వుండటం నాకూ అంతే ఆనందకరం. మీ ప్రస్థానానికి స్ఫూర్తి ఇచ్చానని తెలిసి మరింత సంతోషించాను. మీ 25 ఏళ్ళ జర్నీలో ఆ విధంగా నేనూ ఒక భాగమైనందుకు గర్వంగా ఉంది. సున్నితమైన వినోదంతో పాటు, ఒక సోషల్ కామెంట్ ని జత చేసి ఆలోచనాత్మకంగా తీసే మీ సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం. ఫిలిం మేకింగ్ లో మీ కంటూ ఒక ప్రత్యేక శైలిని క్రియేట్ చేసుకున్న మీరు ఇలాగే మరో 25 ఏళ్ళు మరెన్నో జనరంజకమైన సినిమాలు వ్రాస్తూ, తీస్తూ, మరెన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తున్నాను. ఒక మైల్ స్టోన్ ని చేరుకున్నందుకు అభినందనలు. ఇంకో 25 ఏళ్ళు కూడా ఇలాగే ముందుకువెళ్లాలి అని రాసుకొచ్చారు.
మై డియర్ శేఖర్, @sekharkammula మీలాంటి ఒక అభిమాని వుండటం నాకూ అంతే ఆనందకరం. మీ ప్రస్థానానికి స్ఫూర్తి నిచ్చానని తెలిసి మరింత సంతోషించాను. మీ 25 years జర్నీలో ఆ విధంగా నేనూ ఒక భాగమైనందుకు గర్వంగా వుంది.సున్నితమైన వినోదంతో పాటు, ఒక సోషల్ కామెంట్ ని జత చేసి ఆలోచనాత్మకంగా తీసే మీ… pic.twitter.com/8MVKQdiiJ3
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 3, 2025