Chiranjeevi | మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ (Varun Tej), నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. నవంబర్ 1వ తేదీన ఇటలీలోని టస్కానీ నగరంలో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి వేడుకలో మెగా, త్రిపాఠి, అల్లు కుటుంబంతోపాటు అతికొద్దిమంది టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా, ఇటలీలో జరిగిన వేడుకలకు సంబధించిన ఓ వీడియోను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మెహందీ వేడుకల్లో (Haldi ceremony) వరుణ్ – లావణ్యతో కలిసి చిరంజీవి – సురేఖ దంపతులకు సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోకి ‘ఇటలీలో ఒక అందమైన సాయంత్రం. చాలా కాలం క్రితం కాదు. రెండు హృదయాలు ప్రేమతో ఒక్కటై.. ఎన్నో మధురమైన క్షణాలు, జ్ఞాపకాలను తీసుకొచ్చాయి. అలాంటి ఒక అందమైన క్షణాన్ని మీతో పంచుకుంటున్నా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Also Read..
Rythu Bandhu | మరోసారి రైతుబంధు పంపిణీకి అనుమతివ్వాలంటూ ఈసీకి బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి
Shubman Gill | గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్.. ప్రకటించిన జట్టు
Wedding In The Air | కూతురి పెళ్లిని గాల్లో జరిపించిన తండ్రి.. హాజరైన 300 మంది అతిథులు