Wedding In The Air | కూతురి పెళ్లిని గాల్లో జరిపించిన తండ్రి.. హాజరైన 300 మంది అతిథులు
Wedding In The Air | పెళ్లి (Wedding) అనేది జీవితంలో మరపురాని వేడుక. అందుకని ఎప్పటికీ గుర్తుండిపోయేలా తమ పెళ్లి వేడుకలు నిర్వహించుకుంటున్నారు నేటి యువతీయువకులు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పెళ్లిళ్లను స్థోమతకు తగ్గటు ఘనంగా జరిపించాలని భావిస్తున్నారు.
Wedding In The Air | పెళ్లి (Wedding) అనేది జీవితంలో మరపురాని వేడుక. అందుకని ఎప్పటికీ గుర్తుండిపోయేలా తమ పెళ్లి వేడుకలు నిర్వహించుకుంటున్నారు నేటి యువతీయువకులు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పెళ్లిళ్లను స్థోమతకు తగ్గటు ఘనంగా జరిపించాలని భావిస్తున్నారు. కాపురం పది కాలాల పాటూ పచ్చగా ఉన్నట్లే.. పెళ్లి వేడుకలూ తరాల పాటూ గుర్తుండిపోవాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఖర్చుకు కూడా ఏమాత్రం వెనుకాడట్లేదు. తాజాగా ఓ తండ్రి కూడా తన కూతురి వివాహాన్ని ఎవరూ ఊహించని విధంగా గాల్లో (Wedding In The Air ) జరిపించి ఎప్పటికీ గుర్తుండేలా వార్తల్లో నిలిచారు.
యూఏఈకి చెందిన భారతీయ వ్యాపారవేత్త దిలీప్ పోప్లే తన కుమార్తె ప్రేమ పెళ్లిని ఏకంగా ఎగురుతున్న విమానంలో జరిపించాడు. ఈ వేడుకకు 300 మంది అతిథులు కూడా హాజరై నూతన వధూవరులను ఆకాశంలో ఆశీర్వదించారు. విధి పోప్లే – హృదేశ్ సైనానీ (Vidhi Popley – Hridesh Sainani) చిన్ననాటి స్నేహితులు. ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఇద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారింది. దీంతో పెద్దల అంగీకారంతో నవంబర్ 24న పెళ్లి చేసుకున్నారు. అయితే, వీరి పెళ్లిని వధువు తండ్రి ఎప్పటికీ గుర్తుండేలా చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో ప్రైవేట్ జెటెక్స్ బోయింగ్ 747 విమానంలో తన కుమార్తె వివాహాన్ని బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిపించాడు. వధూవరులు, అతిథులతో బయల్దేరిన విమానం దుబాయ్ నుండి ఒమన్ (Dubai to Oman)కు 3 గంటల పాటు ప్రయాణం చేసింది. ఆ సమయంలోనే బంధుమిత్రుల సమక్షంలో ఈ ప్రేమ జంట.. భార్యాభర్తల బంధంలోకి అడుగుపెట్టింది.
మరో విశేషం ఏంటంటే.. వధువు తండ్రి కూడా 30 ఏళ్ల క్రితం ఇలానే ఫ్లైట్‌లో పెళ్లి చేసుకున్నాడు. 1994లో ఎయిర్ బస్ A310లో దిలీప్ పోప్లే వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అప్పుడు ఆ విమానం ముంబై నుంచి అమ్మదాబాద్ వరకూ ప్రయాణించింది. ఇప్పుడు మళ్లీ అదే సీన్‌నే తన కుమార్తె పెళ్లికి రిపీట్ చేశాడు దిలీప్. మరోవైపు ఈ వివాహం గురించి వరుడు.. హృదేశ్ సైనానీ మాట్లాడుతూ.. ఫ్లైట్‌లో తను హై స్కూల్ నుంచి ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమ ప్రేమ పెళ్లికి అంగీకరించిన తల్లిదండ్రులు, పెళ్లికి విచ్చేసిన మిత్రులు, బంధువులు, జెటెక్స్తో సహా అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Also Read..
Deepfake Videos | రష్మిక, కత్రినా, కాజోల్.. ఇప్పుడు అలియా డీప్‌ఫేక్ వీడియో వైరల్
Pneumonia | చైనాలో న్యుమోనియా.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
PM Modi | విదేశాల్లో పెండ్లి వేడుకలు అవసరమా?.. దేశంలోని ఉన్నత కుటుంబా ధోరణిని తప్పుబట్టిన ప్రధాని
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

