Chiranjeevi | మెగాస్టార్, సూపర్ స్టార్లు ఇట్టే అయిపోరు.దాని వెనక కృషి, సహనం, మంచితనం, పట్టుదల వంటివి ఉంటాయి. అయితే ఎంత మంది హీరోలు వచ్చిన వన్ అండ్ ఓన్లీ వన్ మెగాస్టార్ ఒక్కరే అని అభిమానులు బల్ల గుద్ది చెబుతుంటారు. ఏడు పదుల వయస్సులోను కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు చిరు. ఈ రోజు ఆయన బర్త్ డే సందర్భంగా మనకు తెలియని ఎన్నో విషయాలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న మరో ఆసక్తికర విషయమేంటంటే… తనపై ఒక అభిమాని విషప్రయోగం చేయడం. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా తెలియజేశాడు.
చిరు మాట్లాడుతూ.. “మరణ మృదంగం సినిమా షూటింగ్ సమయంలో ఓ అభిమాని బర్త్‌డే కేక్ తెచ్చి, బలవంతంగా నా నోట్లో పెట్టాడు. నాకు స్పూన్తోనే తినడం అలవాటు కావడంతో, అది చేదుగా అనిపించి వెంటనే బయటకు ఊసాను. తర్వాత సెట్లో ఉన్నవారికి చెప్పగానే, అతన్ని పట్టుకున్నారు. విచారణ చేస్తే అసలు విషయం బయటపడింది. ఆ అభిమాని కేక్‌లో విషం కలిపాడు. కేరళ నుంచి తీసుకొచ్చిన వశీకరణం పౌడర్‌ను కేక్‌లో కలిపాడట. అందులో విషం ఉన్నట్లు తేలింది. అతను ఒక పిచ్చి అభిమాని. నేనతన్ని పట్టించుకోలేదనే కోపంతో ఇలా చేశాడట. అయినా కూడా నేను అతనిని క్షమించేశాను, అని చెప్పారు.
ఈ సంఘటనను చిరు చాలా సింపుల్‌గా చెప్పినప్పటికీ, ఇది విన్నవాళ్లంతా షాక్ అయ్యారు. కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ హితవు పలికారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా కొనసాగుతున్నారు. ఓ వైపు వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ విజువల్ వండర్ “విశ్వంభర”, మరోవైపు హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నాడు. బాబీతో కలిసి మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీటిలో చిరు- అనీల్ ప్రాజెక్ట్ ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతికి ఈ మూవీని తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. ఇక విశ్వంభర 2026 సమ్మర్లో రిలీజ్ కానుంది.