అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ‘మన శంకర వరప్రసాద్‌గారు’. నయనతార కథానాయిక. అనిల్ రావిపూడి దర్శకుడు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలు. సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.
ఈ ఆల్బమ్‌ని స్పెషల్ కాన్సెప్ట్‌గా డిజైన్ చేయడం విశేషం. ‘మీసాల పిల్లా.. నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా..’ అంటూ ఈ పాట సాగింది. లెజెండరీ గాయకుడు ఉదిత్ నారాయణ్ పాటను ఆలపించారు. నాస్టాల్జియా, మెలొడీ కలగలుపుగా వస్తున్న ఈ పాట అందరికీ నచ్చుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: శ్రీమతి అర్చన, నిర్మాణం: షైన్‌స్క్రీన్స్ అండ్ గోల్డ్ బాక్స్ ఎంటైర్టెన్మెంట్స్.