C kalyan | తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వర్కర్స్ ఫెడరేషన్‌కు చెందిన 24 కార్మిక సంఘాలు వేతనాల పెంపు కోసం సినిమా షూటింగ్‌లను నిలిపివేయాలంటూ బంద్‌కు పిలుపునిచ్చారని తెలిసిందే. వర్కర్ల ప్రధాన డిమాండ్ వేతనాలను 30 శాతం మేర పెంచాలని.. ఫెడరేషన్ ప్రతినిధులు ఫిలిం ఛాంబర్‌తో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు అనుకూల ఫలితాలు ఇవ్వకపోవడంతో నిరసనగా బంద్ ప్రకటించారు. ఈ మేరకు కార్మికులు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో కమిషనర్ ఆఫీసుకు కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలో సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంపై చిరంజీవితో నిర్మాతలు సమావేశమై చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా నిర్మాత సీ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. సినీ కార్మికుల వేతనాలపై చాంబర్, యూనియన్లు చర్చలతో ముందుకెళ్లాలని చిరంజీవి సూచించారు. మీరు సామరస్యంగా చర్చలు జరిపి షూటింగ్ మొదలు పెడితే ఒకే.. లేకపోతే రెండు మూడు రోజుల వరకూ వేచిచూస్తానని ఆయన చెప్పారు. అప్పటిదాకా మీరు సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అప్పటికీ పరిష్కారం కాకపోతే తన నిర్ణయం చెబుతానన్న చిరంజీవి పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో చిరంజీవి సూచన ఫాలో అవుతామని చెప్పారు సీ కల్యాణ్.
సినీ కార్మికులకు లేబర్ కమిషనర్ కిందకి వచ్చే 13 క్రాఫ్ట్స్‌లోనూ 30 శాతం వేతనాల పెంపు చేయాలని ఫెడరేషన్ కోరుతోంది. ఈ నేపథ్యంలో అదనపు కమిషనర్ గంగాధర్ ఇప్పటికే నిర్మాతలతో ఇప్పటికే ఒకసారి మాట్లాడారు. అయితే ఎంత మేరకు పెంచుతారనే దానిపై స్పష్టత రాలేదు. లేబర్ కమిషనర్ మరోసారి నిర్మాతలతో చర్చలు జరిపే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
Film Chamber | సాప్ట్వేర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు.. సినీ కార్మికుల నిరసనపై ప్రసన్న కుమార్
JSK | అనుపమ పరమేశ్వరన్ జేఎస్కే మూవీ పాన్ ఇండియా ఓటీటీ డెబ్యూ.. ఏ ప్లాట్ఫాంలోనో తెలుసా..?
Kingdom Banner | విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ బ్యానర్లు చించేసిన తమిళ ప్రజలు.. ఎందుకంటే ?