Chiranjeevi | నాగ చైతన్య, సమంత కాంబోలో రూపొందిన చిత్రం ఏ మాయ చేశావే. ఈ చిత్రం ఇద్దరికి స్పెషల్ అనే చెప్పాలి . అక్కినేని నాగ చైతన్యకు ఇది రెండో సినిమా కాగా, సమంతకి తొలి చిత్రం. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ ఈ చిత్రాన్ని చాలా హృద్యంగా తెరకెక్కించారు. జులై 18 నాటికి ఈ చారిత్రాత్మక ప్రేమకథ 15 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గౌతమ్ మేనన్ ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేశారు.
ఈ కథను మొదట మహేశ్ బాబును దృష్టిలో పెట్టుకొని రాసుకున్నాను. ఆయనతోనే తీసే ఆలోచన చేశాను. అంతేకాదు క్లైమాక్స్‌లో మెగాస్టార్ చిరంజీవిని గెస్ట్ రోల్లో పెట్టాలనుకున్నాను. స్టోరీకి ఓ కొత్త డైమెన్షన్ వస్తుందనిపించింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ ప్లాన్ కుదరలేదు అని చెప్పారు గౌతమ్.క్లైమాక్స్‌లో చిరంజీవితో ఎలా అయిన చేయించాలని అనుకున్నాను కాని మనం చేస్తే ఆడియన్స్ యాక్షన్ సినిమా అనుకుంటారు అని చిరంజీవి రిజెక్ట్ చేశారంటూ గౌతమ్ మీనన్ చెప్పారు. అయితే చిరంజీవి కోసం నేను రాసుకున్న కథ ఎలా ఉందంటే.. క్లైమాక్స్ లో హీరో చిరంజీవి సినిమా డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ పెళ్లి వేరేవాళ్లతో జరుగుతుందని తెలిసి చిరంజీవి హీరోని హెలికాఫ్టర్ లో ఎక్కించుకొని పెళ్లి దగ్గరకు తీసుకెళ్లి హీరో- హీరోయిన్ ని కలుపుతాడు.
ఇలా రాసుకున్న కథని నేను చిరంజీవి గారికి చెప్పగా ఆయన రిజెక్ట్ చేశారంటూ గౌతమ్ మీనన్ తెలియజేశారు. ఈ సినిమా నాగ చైతన్యకు కెరీర్లో ప్రత్యేకంగా కాగా , సమంతకు స్టార్డమ్ తెచ్చి పెట్టింది. ఇక ఈ మూవీ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం, ప్రేమ ప్రారంభమైంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని, తిరిగి విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ “ఏ మాయ చేశావే” మాత్రం ఈ ఇద్దరి జీవితాల్లో ఓ ఎమోషనల్ చాప్టర్గానే నిలిచింది. ఏ మాయ చేశావే తెలుగు వర్షెన్ సెన్సిబుల్ లవ్ స్టోరీగా హిట్ కాగా, తమిళ వెర్షన్ విన్నైతాండి వరువాయా పేరుతో రూపొందింది. శింబు-త్రిష కాంబోలో వచ్చిన ఈ చిత్రం సూపర్ సక్సెస్. హిందీ వెర్షన్ ఏక్ థా దీవానా అనే పేరుతో తెరకెక్కగా, ఎందుకో సినిమా ఫ్లాప్ అయింది.