Chirajeevi | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిరంజీవి తన చారిటిబుల్ ట్రస్ట్ ద్వారా సినీ పరిశ్రమకు చెందిన మహిళలను సత్కరించాడు. ఈ క్రమంలో స్త్రీల గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చాటి చెప్పాడు. ఇక ఏపి టిక్కెట్ల పెంపు జీవోపై మాట్లడడానికి చిరంజీవి నిరాకరించాడు. ‘సినిమా టికెట్ల జీవోపై ఇప్పుడు మాట్లాడను.. ఇది సందర్భం కాదు’ అని పేర్కొన్నాడు. అంతే కాకుండా ఇప్పుడు ‘నేను ఏది మాట్లాడినా అది కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది. జీవో గురించి అవసరమైతే ప్రత్యేకంగా మాట్లాడుతా’ అని చెప్పారు.
తాజాగానే టికెట్ ధరల పెంపు జీవోపై చిరంజీవి ట్విట్టర్ వేదికగా ‘తెలుగు సినీ పరిశ్రమకు మేలు కలిగే విధంగా అటు థియేటర్ల మనుగడను, ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ జీవోజారీచేసిన సీఎం వైఎస్ జగన్కు సినీ పరిశ్రమ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. చిన్న సినిమాకు ఐదో షో అవకాశం కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశం. సంబంధింత శాఖ మంత్రి పేర్ని నాని, అధికారులు, కమిటీ సభ్యులకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశాడు.