Chiranjeevi | 90లలో మెగాస్టార్ సినిమాలంటే అభిమానులు పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. తొలి రోజు తొలి ఆట చూసేందుకు థియేటర్స్ దగ్గర బారులు తీరేవారు. ఆయనకి ఉన్న అభిమానగణం అంతా ఇంతా కాదు. చిరంజీవి సినిమా వస్తుందంటే పండగ వాతావరణం ఉండేది. అయితే రాజకీయాల వలన మధ్యలో సినిమాలకి బ్రేక్ ఇచ్చిన చిరు ఇప్పుడు తిరిగి సినిమాలపైన దృష్టి పెట్టారు. ఖైదీ నెం 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఇప్పుడు నాన్‌స్టాప్‌గా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రీఎంట్రీలో చిరంజీవి పలు రీమేక్‌లు చేశారు. అందులో కొన్ని తేడా కొట్టాయి. దీంతో రీమేక్ చిత్రాలపై మెగాస్టార్ సంచలన నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసిన ‘గాడ్ ఫాదర్’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి తుస్సుమంది. మలయాళ చిత్రం ‘లూసీఫర్’ కి రీమేక్. సూపర్ గుడ్ ఫిల్మ్స్ భాగస్వామ్యంలో చిరంజీవి సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ చిత్రాన్ని నిర్మించింది. అయితే ఫలితాలు ఆశించిన విధంగా రాకపోవడంతో నష్టాలు తప్పలేదు. ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే రీమేక్ చిత్రం చేశారు. ఈ చిత్రం కూడా మలయాళ చిత్రం ‘వేదాళం’కు రీమేక్ . ఈ మూవీతో మెహర్ మళ్లీ గాడిలో పడతాడని అనుకున్నారు. ఆయన హిట్ అందుకోపోగా, చిరంజీవికి పెద్ద డిజాస్టర్ అందించారు.
అలా రెండు రీమేక్ లు చిరంజీవికి పెద్ద షాక్ ఇవ్వడంతో ఇప్పుడు ఆయన రీమేక్ అంటే నో చెప్పేస్తున్నారట. ఇటీవల కొంత మంది దర్శకులు పరభాషా చిత్రాలని రీమేక్ చేద్దామని చిరంజీవిని అప్రోచ్ అయ్యారట. కానీ అందుకు చిరంజీవి ఒప్పుకోలేదట. ఈ లిస్ట్ లో వి. వి.వినాయక్ కూడా ఉన్నారని సమా చారం. వినాయక్ హిందీ సినిమా రీమేక్ చేద్దామని అంటే, తర్వాత చూద్దామని చెప్పా రట. అలాగే ఎంపురాన్ లూసీఫర్ 2 రీమేక్ చేద్దామని మరో డైరెక్టర్ కూడా వెళ్లగా, అతనికి కూడా సున్నితంగా చెప్పి పంపించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర చిత్రంతో బిజీగా ఉండగా, ఈ మూవీని వీలైనంత త్వరగా విడుదల చేయనున్నారు. మరోవైపు అనీల్ రావిపూడి సినిమాతో సంక్రాంతి పలకరించనున్నారు మెగాస్టార్.