Chiranjeevi Next Movie | ‘ఆచార్య’, ‘గాడ్‌ఫాదర్’ వంటి కమర్షియల్ ఫేయిల్యూర్స్ తర్వాత ‘వాల్తేరు వీరయ్య’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు చిరు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా కోట్లు కొల్లగొట్టింది. రూ.250 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసి చిరుకు తిరుగులేని విజయాన్నిందించింది. అయితే ఈ విజయం సెలెబ్రేట్ చేసుకునే గ్యాప్‌లోనే ‘భోళా శంకర్ అంటూ’ మళ్లీ ప్లాప్ అందుకున్నాడు చిరు. ప్రస్తుతం ‘బింబిసార’తో మెప్పించిన యువ దర్శకుడు వశిష్ట డైరెక్షన్లో మెగా 156 చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి విశ్వంభర అనే పేరు పరిశీలనలో వున్న సంగతి తెలిసిందే. సోషియా ఫాంటసీ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని లీడింగ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
అయితే ఈ సినిమా షూటింగ్ సగం కూడా పూర్తి కాకుండానే మెగా 157 సంబంధించిన అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగా 157 కోసం ఒక స్టార్ డైరెక్టర్ కథ రాసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇంతకి అతను ఎవరో కాదు.. ఈ ఏడాది భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి. టాలీవుడ్ లేటెస్ట్ బజ్ ప్రకారం మెగా 157 కోసం అనీల్ రావిపూడి మెగాస్టార్ల క్రేజీ కాంబో దాదాపు ఖరారు అయ్యినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ చర్చలలో ఉండగా ఫైనలైజ్ అయ్యాక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ పై అనౌన్స్మెంట్ రావొచ్చని తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.