Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి తిరిగి తన గోల్డెన్ గ్లోరీకి సరిపడే మాస్, క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో రాబోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “మన శంకర వరప్రసాద్ గారు” సినిమా నుంచి మొదటి పాట “మీసాల పిల్లా” ప్రోమో విడుదలై ఫ్యాన్స్‌లో తెగ హైప్ క్రియేట్ చేస్తోంది. దసరా కానుకగా రిలీజ్ చేసిన పాట ప్రోమోలో చిరు స్టైల్, చిరు గ్రేస్, చిరు ఎనర్జీ అన్ని చూసి అభిమానులు పండగలా ఫీల్ అవుతున్నారు. ఈ పాటను యూనిట్ సభ్యులు “మెగా గ్రేస్ సాంగ్” అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఇందులో చిరంజీవి తన క్లాసిక్ డాన్స్ మూమెంట్స్, చిరునవ్వులు, స్టైలిష్ లుక్స్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు
నయనతారతో స్క్రీన్‌పై కనిపించిన చిరు తన రొమాంటిక్ మోమెంట్స్‌తో ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించాడు. మీసాల పిల్ల సాంగ్‌కి సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించగా, ఉదిత్ నారాయణ్ గాత్రం అందించారు. చిరంజీవి సినిమాల్లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన ఈ లెజెండరీ గాయకుడు, మళ్లీ మెగా మ్యూజిక్‌ని గుర్తు చేస్తూ పాటకి ప్రాణం పోశారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాలో చిరుకి సంబంధించిన క్లాస్, మాస్, కామెడీ, ఫ్యామిలీ, ఎమోషన్ షేడ్స్ అన్నింటినీ చూపించబోతున్నారని ముందే చెప్పాడు. అందుకు సంకేతంగా ఈ “మీసాల పిల్లా” ప్రోమో నిలిచింది. చిరంజీవి టైమింగ్, హ్యూమర్ బీట్లు ప్రోమోలో స్పష్టంగా కనిపించాయి.
సాహు గరపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, మ్యూజిక్ విభాగంలో నాలుగు పాటలూ ప్రత్యేకంగా ఉంటాయని టాక్. యూనిట్ తెలిపిన వివరాల ప్రకారం మెగా క్లాస్, మెగా స్వాగ్, మెగా విక్టరీ మాస్, మెగా ఎమోషన్ అనే కాన్సెప్ట్స్‌తో నాలుగు పాటలు రూపొందుతున్నాయి. వీటిలో ఒక్కో పాటలో చిరంజీవి కొత్త యాంగిల్స్ కనిపించనున్నాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతి 2026 సందర్భంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే 70 ఏళ్ల వయస్సులో కూడా చిరు అదే గ్రేస్‌తో స్టెప్పులేయడం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
Happy Dussehra to everyone from team #ManaShankaraVaraPrasadGaru ❤️🔥
Celebrate the eve with the Mega Grace First Single – #MeesaalaPilla Promo out Now🫶
A #Bheemsceciroleo Musical 🎵
Sung by #UditNarayan ji & @shwetamohan
Lyrics by @bhaskarabhatla… pic.twitter.com/525zd7xLyi— Shine Screens (@Shine_Screens) October 2, 2025