Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ ప్రాజెక్ట్ Mega157 టైటిల్ ఇటీవల అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి జన్మదినం సందర్భంగా టైటిల్ రివీల్ చేస్తూ.. ఈ మూవీకి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ అనే టైటిల్ పెట్టినట్టు తెలియజేశారు. టైటిల్ గ్లింప్స్‌తో పాటు విడుదలైన వీడియో మెగా అభిమానులలో మరింత ఉత్సాహాన్ని నింపింది. ప్రస్తుతం షూటింగ్ తుదిదశలో ఉన్న ఈ సినిమా 2026 సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. చిరంజీవి మరియు అనిల్ రావిపూడి కలయికపై మొదటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి తన కామెడీ టచ్‌తో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు చిరంజీవితో కలిసి ఆయన మరింత ఎక్స్ట్రార్డినరీ మాస్ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నారని టాక్ నడుస్తుంది.
గ్లింప్స్ వీడియోలో చిరంజీవి ఒక సరికొత్త అవతారంలో కనిపించారు. సూట్లో స్టైలిష్ లుక్, చేతిలో తుపాకి, మరోవైపు గుర్రాన్ని పట్టుకుని సిగరెట్ కాలుస్తూ ఇచ్చిన వింటేజ్ మాస్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ద్వారా “మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు” అనే డైలాగ్ తో టైటిల్‌ను ప్రకటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంక్రాంతికి మూవీని తీసుకొచ్చేందుకు టీమ్ ఫుల్ జోష్‌తో పని చేస్తుంది. తాజాగా మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. కేరళలో కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేటి నుండి సెప్టెంబర్ 19 వరకు చిత్రీకరణ జరపనుండగా, ఈ షెడ్యూల్లో రెండు పాటలు చిత్రీకరించనున్నారట.
ఇక అక్టోబర్ 5 నుండి మొదలు కానున్న మరో షెడ్యూల్లో విక్టరీ వెంకటేష్ భాగం కానున్నారని చిత్ర నిర్మాత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. చిరు స్టైల్ కి అనిల్ కామెడీ డోస్ జతకలిస్తే, ఈ చిత్రం సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు. ఇందులో చిరు సరసన నయనతార కథానాయికగా నటిస్తుంది. మరోవైపు చిరు విశ్వంభర అనే చిత్రం చేస్తుండా, ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కి రానుంది. ఇందులో చిరు సరసన త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.