మదర్స్ డే (Mothers day) సందర్భంగా అందరూ తమ తమ తల్లుల ప్రేమను, సేవలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ…అమ్మలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్బంగా టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi) తన తన తల్లి అంజనా దేవి (Anjana Devi) కి సంబంధించి ఇంట్రెస్టింగ్ స్పెషల్ వీడియోను ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. ఓ సినిమా షూటింగ్స్ సెట్స్ లో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనానికి చిరంజీవి, పవన్ కల్యాణ్ (Pawan Kalyan), నాగబాబు (Naga Babu) తమ తల్లి అంజనాదేవిని ఆహ్వానించారు.
ముగ్గురు కుమారులతో కలిసి భోజనం చేశారు అంజనాదేవి. ఆ తర్వాత చిరంజీవి అమ్మకు గొడుగు పట్టుకోగా..పవన్ చేయి పట్టుకుని కారులో కూర్చొబెట్టాడు. అమ్మతో కలిసి సెట్స్ లో భోజనం చేసిన మధురమైన క్షణాలకు సంబంధించిన వీడియోను ట్విట్ చేస్తూ..ప్రపంచంలోకి అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు చిరంజీవి. ఇపుడు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. మోహర్ రమేశ్‌తో భోళా శంకర్, మోహన్ రాజాతో గాడ్ ఫాదర్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. బాబీతో కూడా సినిమా చేస్తున్నాడు. మరోవైపు పవన్ కల్యాణ్ కూడా మల్టీపుల్ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు.
అమ్మలందరికీ అభివందనములు !#HappyMothersDay to All The Mothers of the World! pic.twitter.com/FNiVxdY2QL
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 8, 2022