Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకి ఇచ్చే గౌరవం చాలా ప్రత్యేకం. సినీ పరిశ్రమలో కూడా ఆయనకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఎన్నో సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకి ప్రత్యేక అవకాశాలు ఇవ్వడం మనం చూశాం. తాజాగా మరో అభిమానికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆట షో ద్వారా పేరు తెచ్చుకున్న డ్యాన్స్ మాస్టర్ సందీప్ ప్రస్తుతం కొరియోగ్రాఫర్‌గా పలు టీవీ షోలు, సినిమాలు, ఈవెంట్లలో పనిచేస్తూ మంచి గుర్తింపు సంపాదించారు. ఆయన భార్య జ్యోతి కూడా డ్యాన్సర్ కావడంతో ఈ జంట కలిసి అనేక ప్రోగ్రామ్‌లలో పాల్గొంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. చిరంజీవి తనకు ప్రియమైన దేవుడి లాంటి వ్యక్తి అని సందీప్ పలుమార్లు ఇంటర్వ్యూలలో చెప్పిన విషయం తెలిసిందే.
తాజాగా ఆట సందీప్ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ అభిమానుల్లో వైరల్‌గా మారింది. సందీప్, ఆయన భార్య జ్యోతి చిరంజీవితో కలిసి దిగిన ఫోటోలను పంచుకుంటూ తనకు లభించిన ఈ గొప్ప అవకాశంపై భావోద్వేగంగా స్పందించారు.నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని రోజు ఇది. స్వయంగా ఆ దేవుడు మెగాస్టార్ చిరంజీవి రూపంలో వచ్చి మాకు వరం ఇచ్చినట్టు అనిపించింది. చింజీవి గారు నన్ను ఇంటికి పిలిచి, నా డాన్స్‌పై నాకెంత నమ్మకం ఉందో, నేను పడిన కష్టం తెలుసుకుని, నాకు కొరియోగ్రఫీ ఛాన్స్ ఇచ్చారు. ఆ క్షణం పరమశివుడి ఆశీర్వాదం పొందినంత ఆనందం ఇచ్చింది. ఇది పూర్తిగా దైవానుగ్రహం లాంటి అనుభూతి.
అంతేకాదు, తన భార్య జ్యోతి గురించి చిరంజీవి చెప్పిన మాటలు, ఇచ్చిన ఆశీర్వాదాలు తమ జీవితానికి కొత్త బలాన్ని ఇచ్చాయని సందీప్ ఎమోషనల్‌గా తెలిపారు. “మా జంటకు ఆశీర్వాదాలు అందించిన ఆయన వినయం, ప్రేమ, ఆప్యాయం… అవి మా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. చిన్నప్పటి నుండి కలగన్న కల నేడు నిజమైంది.” అంటూ సందీప్ భావోద్వేగంగా పోస్ట్ చేశారు. చిరంజీవి ఇచ్చిన ఈ అవకాశం సందీప్ కెరీర్‌కు పెద్ద మలుపు అవుతుందని అభిమానులు సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటిస్తున్నారు. అలానే ఆయన నటించిన విశ్వంభర చిత్రం సమ్మర్లో విడుదలకి రెడీగా ఉంది.