చిరంజీవి, వెంకటేశ్ వంటి ఇద్దరు సూపర్‌స్టార్స్‌ని ఒకే ఫ్రేమ్‌లో చూడటం నిజంగా ఓ మ్యాజికల్ మూమెంట్. ఇందుకు చిరంజీవి తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ వేదిక కాబోతున్నది. ఈ సినిమాలో వెంకటేశ్ కీలకమైన అతిథి పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే. మేకర్స్ ఈ వార్తను ప్రకటించినప్పటి నుంచి అభిమానులు ఈ సినిమా అప్డేట్స్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఈ సినిమా షూటింగ్లో వెంకటేశ్ జాయిన్ అయ్యారు. చిరు-వెంకీ ద్వయంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో వెంకటేశ్‌కు వెల్కమ్ చెబుతూ చిరంజీవి ఆయన్ని ‘మై బ్రదర్’ అని పిలవగా, ‘చిరుసర్.. మై బాస్’ అంటూ వెంకటేశ్ చిరుని ఆప్యాయంగా హత్తుకున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్నందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది.