యువ దర్శకులకు గ్రీన్ సిగ్నల్!
‘వాల్తేరు వీరయ్య’ చిత్రం అందించిన విజయంతో మంచి జోష్లో వున్నారు సీనియర్ కథానాయకుడు చిరంజీవి. పూర్తి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఆ చిత్రం సక్సెస్తో వరుసగా చిత్రాలు చేయాలనే ఉత్సాహంతో కొత్త కథలు వింటున్నారు చిరంజీవి.
‘వాల్తేరు వీరయ్య’ చిత్రం అందించిన విజయంతో మంచి జోష్లో వున్నారు సీనియర్ కథానాయకుడు చిరంజీవి. పూర్తి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఆ చిత్రం సక్సెస్తో వరుసగా చిత్రాలు చేయాలనే ఉత్సాహంతో కొత్త కథలు వింటున్నారు చిరంజీవి. ప్రస్తుతం మోహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భోళా శంకర్’ చిత్రంలో నటిస్తున్న చిరు తదుపరి చిత్రాల కథలను కూడా ఓకే చేసినట్లు సమాచారం. ఇటీవల ‘బింబిసార’ చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న వశిష్ట చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.
ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రంతో పాటు ‘సోగ్గాడే చిన్ని నాయన’ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కూడా చిరంజీవి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల తన సొంత బ్యానర్లో నిర్మించనుంది. ఈ యువ దర్శకుల కాంబినేషన్లో చిరంజీవి నటించనున్న ఈ చిత్రాల మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

