మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. చిరంజీవి నటిస్తున్న 156వ సినిమా ఇది. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పంచభూతాలు, ముల్లోకాల కాన్సెప్ట్స్ ప్రధానంగా ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది.
కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియో సినిమాపై మరింతగా అంచనాలను పెంచింది. ఫాంటసీ చిత్రం కావడంతో చిరంజీవి పాత్ర ఎలా ఉంటుందోనని అభిమానులు ఉత్సుకతగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలోని కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో చిరంజీవి డబ్బు ఏండ్ల వృద్ధుడి పాత్రలో కనిపిస్తాడని, కథాగమనంలో ఆ సన్నివేశాలు కీలకంగా ఉంటాయని చెబుతున్నారు. ఆ ఎపిసోడ్ తాలూకు విజువల్స్ కూడా అబ్బురపరిచే రీతిలో ఉంటాయని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.