స్వయంకృషితో ఈ స్థాయికి చేరిన చిరంజీవికి కష్టం విలువ తెలుసు.తన అభిమానులు ఆపదలో ఉంటే వెంటనే స్పందిస్తారు చిరంజీవి.మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ బేస్ మరో హీరోకు లేదు అనడంతో ఏమాత్రం సందేహం లేదు. ఆయన మీద అభిమానులు ఎంత ప్రేమ చూపిస్తారో చిరంజీవి కూడా వారి మీద అంతే ప్రేమ చూపిస్తారు.
ఇప్పటి వరకు ఎన్నో సాయాలు ఎందరికో గుప్త దానాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇపుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ అభిమానికి ఎంతైనా ఖర్చు చేసి బ్రతికించేందుకు సిద్ధం అయ్యారు. విశాఖ జిల్లాకి చెందిన చిరంజీవి అభిమాని వెంకట్ క్యాన్సర్ తో పోరాడుతున్నారు. అయితే ఈ విషయాన్ని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు చిరు దృష్టికి తీసుకెళ్లారు.
చిరంజీవి వెంటనే వెంకట్‌కు మెరుగైన వైద్యం అందించాలని భావించాడు. హైదరాబాద్‌కి తరలించమని పూర్తిగా వైద్య ఖర్చులు తాను భరిస్తానని హామీ ఇచ్చి తన ఉదారత చాటుకున్నారు. ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక చిరు సినిమాల విషయానికి వస్తే ఇటీవల ఆచార్య పూర్తి చేసిన మెగాస్టార్ గాడ్ ఫాదర్ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.