Chiranjeevi | సిల్వర్ స్క్రీన్‌పై కొన్ని కాంబినేషన్స్ రాబోతున్నాయంటే క్రేజ్ మామూలుగా ఉండదు. అలాంటి కాంబో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) -హరీష్ శంకర్. చాలా రోజుల క్రితమే ఈ ఇద్దరు ఓ సినిమా చేయబోతున్నారంటూ నెట్టింట వార్త తెరపైకి వచ్చిందని తెలిసిందే. అయితే మళ్లీ ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. తాజాగా చిరు ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
హరీష్ శంకర్ (Harish Shankar) ఇటీవలే చిరంజీవికి డ్రాఫ్ట్‌ను వివరించగా.. ఓకే చెప్పాడట. అంతేకాదు ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించనుందని ఇన్సైడ్ టాక్. ఇదే విషయాన్ని త్వరలోనే ప్రకటించనున్నారట మేకర్స్. చిరంజీవి ప్రస్తుతం టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం విశ్వంభర. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
విశ్వంభర తర్వాత చిరంజీవి ప్రకటించబోయే కొత్త సినిమా ఇదే అవనుందని అప్పుడే చర్చించుకోవడం మొదలుపెట్టారు అభిమానులు. మిరపకాయ్, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్‌తో ఇండస్ట్రీని షేక్ చేసిన హరీష్ శంకర్ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.