Bobby kolli | మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య దర్శకుడికి ఖరీదైన బహుమతిని అందజేశారు. చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమా 2023లో విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత చాలారోజులకు బాబీని ఇంటికి పిలిపించుకోని చిరు వాచ్‌ని గిప్ట్గా ఇచ్చాడు.
ఒమేగా సీమాస్టర్ డైవర్ 300 M వాచ్‌ను బాబీ కొల్లికి బహుమతిగా ఇచ్చారు. ఈ వాచ్ విలువ సుమారు రూ. 4.88 లక్షలు ఉంటుందని అంచనా. వాచ్ ఇచ్చిన అనంతరం బాబీ కొల్లి తన సంతోషాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. చిరంజీవి తనకు ఇచ్చిన ప్రోత్సాహానికి, ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మూమెంట్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు.
A beautiful MEGA surprise from the Boss himself 🤩
Thank you dearest Megastar @KChiruTweets garu for this priceless gift 💝
Your love, encouragement, and blessings mean the world to me annaya 🙏 I’ll cherish this moment forever 🤗 pic.twitter.com/pkCXi3SozH
— Bobby (@dirbobby) May 22, 2025