Chiranjeevi | తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన స్టైల్లో డ్యాన్స్, ఫైట్స్, నటనతో ఎంతో మంది ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు చిరు. ఇప్పటికీ ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. దర్శకుడు వశిష్ఠతో ‘విశ్వంభర’ అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయగా, ఈ మూవీ విడుదలకి సిద్ధంగా ఉంది. మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడితో మరో మాస్ అండ్ ఎంటర్టైనింగ్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం మెగా ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేయనుందని అంటున్నారు.
అయితే ఈ మధ్య చాలా మంది హీరోలు ఓటీటీ రంగంలోను సందడి చేస్తున్నారు. నటులుగానో లేదంటే హోస్ట్‌గాను అలరిస్తున్నారు. నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలు ఇప్పటికే ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టగా చిరంజీవి ఎంట్రీ ఎప్పుడా అని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకి దీనిపై క్లారిటీ ఇచ్చారు చిరు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన కుబేర చిత్రంగ్రాండ్ సక్సెస్ మీట్‌కి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన ఆయన తన స్పీచ్‌తో ప్రేక్షకుల్ని ఉత్సాహపరిచారు. తన స్నేహితుడు నాగార్జునపై ప్రశంసల వర్షం కురిపించి, ఎన్నో విషయాల్లో నాగార్జున తనకు స్ఫూర్తి అని చెప్పకొచ్చారు. తన ఆరోగ్యం, నడవడిక, ఆలోచనలు, స్థితప్రజ్ఞత.. ఇలా ఎన్నో విషయాలు నాగ్‌లో నాకు నచ్చుతాయి.
నేను కూడా భవిష్యత్తులో ఏమైనా అవసరం వచ్చి ఓటీటీలో సినిమాలు చేయాల్సి వస్తే దానికి రెడీ. ఇప్పటి నుండే ఆ విషయంలో మానసికంగా సిద్ధంగా ఉంటాను. గతంలో తనకు ‘ది ఫ్యామిలీ మాన్’ వంటి ప్రముఖ వెబ్ సిరీస్ అవకాశం వచ్చిందన్నారు. కానీ అప్పట్లో టైమ్, కథ సరిపోక రిజెక్ట్ చేశానని చెప్పారు. ఇప్పుడు పరిస్థితి మారిందని, సరైన పాత్ర, మంచి కథ ఉంటే ఓటీటీ కోసం సిద్ధమని స్పష్టం చేశారు. ఈ విషయంలోనూ నాగార్జున నాకు స్ఫూర్తి. ‘ఓటీటీకి రెడీ అన్నాను కదా అని రేపు ఉదయాన్నే స్క్రిప్ట్స్ తీసుకొని వచ్చేయకండి’ అని అన్నారు చిరు. మెగాస్టార్‌ని ఓ వెబ్ సిరీస్ లేదా ఓటీటీ మూవీలో చూడాలని ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది శుభవార్త అనే చెప్పాలి.