Chiranjeevi | సినిమా ఇండస్ట్రీలో కొందరికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. దాదాపు ఆ సెంటిమెంట్స్ ని అందరు ఫాలో అవుతుంటారు. అయితే కొన్ని సందర్భాలలో వాటిని బ్రేక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. 24 ఏళ్ల తర్వాత చిరంజీవి ఓ సెంటిమెంట్‌ని బ్రేక్ చేయబోతున్నారని తెలుస్తుంది. సాధారణంగా చిరంజీవి సినిమాల్లో ఆయన పాట పాడితే.. ఆసినిమా ప్లాప్ అవుతుందని ఓ నమ్మకం ఉంది. అందుకు కారణం గతంలో ఆయన పాట పాడిన సినిమాలు అన్ని ఫ్లాప్ అయ్యాయి. దాంతో గత 24 ఏళ్ళుగా ఆయన సినిమాల్లో పాటలు పాడింది లేదు.
1997 లో మాస్టర్ సినిమా కోసం ‘తమ్ముడు అరే తమ్ముడు ఈ తికమక దిగులే ప్రేమంటే’ అని పాట పాడిన చిరంజీవి ఈ సినిమాని హిట్ చేయలేకపోయాడ. ఇక 2001 లో వచ్చిన మృగరాజు సినిమా కోసం కూడా పాట పాడారు చిరంజీవి. ‘అరె ఛాయ్ చటుక్కున్నా తాగరా భాయ్’ అంటూ మాస్ సాంగ్ ను ఆలపించగా, సాంగ్ మంచి హిట్ అయింది కాని సినిమా ఫ్లాప్ అయింది. గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన మృగరాజు కాన్సెప్ట్ అంత అద్భుతంగా ఉన్నా.. సినిమా మాత్రం హిట్ అవ్వలేదు. ఇక అప్పటి నుంచి చిరంజీవి తన సినిమాల్లో పాటలు పాడటం తగ్గించారు. రీఎంట్రీ తర్వాత కూడా చిరంజీవి తన సినిమాలలో పాటలు పాడింది లేదు.
కాని విశ్వంభర సినిమా కోసం చిరంజీవి తన గొంతు సవరించుకోబోతున్నట్టు తెలుస్తుంది. 24 ఏళ్ళ తర్వాత తన సెంటిమెంట్ ను బ్రేక్ చేసి.. మరోసారి సాహసం చేయబోతున్నారని తెలుస్తోంది. కీరవాణి చిరంజీవి కోసం ఓ అద్భుతమైన పాటను రెడీ చేయగా, ఈ పాటని త్వరలోనే చిరంజీవి పాడబోతున్నారట. మరి ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు హీరోలు తమ సినిమాలలో పాటలు పాడగా, అవి హిట్ అయ్యాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే చాలా కాలంగా తన సినిమాలకోసం ఒక్క పాట అయిన పాడుతుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కొన్ని పాటలు పాడారు. రవితేజ కూడా ఆలపించారు. రీసెంట్గా వెంకటేష్ కూడా తన సినిమా కోసం ఓ పాట పాడారు