Chiru154 Shooting Update | చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ యువ హీరోలకు పోటీనిస్తున్నాడు. అప్పట్లో చిరంజీవికి ఎంత బిజీ షెడ్యూల్ ఉందో, ఇప్పుడు కూడా అంతే ఉంది. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇటీవలే చిరు ‘ఆచార్య’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ప్రేక్షకులనే కాదు మెగా ఆభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలో చిరు తన తదుపరి చిత్రాలపై పూర్తి దృష్టిని పెట్టాడు. ప్రస్తుతం చిరు రెండు సినిమా షూటింగ్‌లను ఏకకాలంలో జరుపుతున్నాడు. అందులో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య ఒకటి. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపకుంటుంది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది
తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ ఎపిసోడ్లో కీలక ఘట్టాలను తెరకెక్కించనున్నారట. ఈ షెడ్యూల్లో రవితేజ కూడా పాల్గొననున్నాడట. కాగా ఇటీవలే దర్శకుడు బాబీ తండ్రి మరణించిన విషయం తెలిసిందే. అయితే షూటింగ్ తన వల్ల ఆగిపోవద్దనే ఉద్దేశంతో బాబీ కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించడం గొప్ప విషయం అనే చెప్పాలి. ఈ చిత్రం ‘ముఠా మేస్త్రీ’ తరహా మాస్ యాంగిల్లో ఉండనున్నట్లు పోస్టర్లను చూస్తే తెలుస్తుంది. చిరు ఈ సినిమాలో అండర్‌కవర్ కాప్‌గా కనిపించనున్నాడు. విశాఖపట్నం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. మాస్రాజ రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం మెగాస్టార్‌కు 154వ సినిమాగా తెరకెక్కుతుంది.