Mega154 Dubbing Begins | ఈ ఏడాది ‘ఆచార్య’తో మెగాస్టార్‌కు మంచి శుభారంభం దక్కకపోయినా.. ఇటీవలే వచ్చిన ‘గాడ్‌ఫాదర్’తో తిరిగి ట్రాక్‌లోకి వచ్చాడు. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను రాబడుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరు మరో రెండు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. అందులో బాబీ దర్శకత్వం వహిస్తున్న మాస్ యాక్షన్ సినిమా ఒకటి. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రీ లుక్ పోస్టర్లు సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన మేజర్ అప్డేట్ను చిత్రబృందం తాజాగా వెల్లడించింది.
ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పూజా కార్యక్రమాలను చిత్రబృందం ఘనంగా జరిపింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఈ చిత్రంలో చిరంజీవి ఈస్ట్ గోదావరి యాసలో డైలాగ్స్ చెప్పనున్నట్లు ఇటీవలే వెల్లడించాడు. ఇక ఈ సినిమా టీజర్ దీపావళి సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో చిరంజీవి ఫిషింగ్ యార్డ్ యూనియన్ లీడర్‌గా కనిపించనున్నాడు. రవితేజ సిన్సియర్ పోలీస్ ఆధికారి పాత్రలో నటించనున్నాడట. ఈ సినిమాలో చిరుకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విక్టరి వెంకటేష్ గెస్ట్ రోల్ కూడా ఉండనున్నట్లు సమాచారం. ఈ మూవీను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
The dubbing formalities of #Mega154 have begun today with a pooja ceremony ❤️🔥
MASSive updates very soon 💥
Poonakaalu Loading 🔥
Megastar @KChiruTweets
Mass Maharaja @RaviTeja_offl @dirbobby @ThisIsDSP @shrutihaasan @prakashraaj @konavenkat99 @SonyMusicSouth pic.twitter.com/8SBn9dcaKs— Mythri Movie Makers (@MythriOfficial) October 14, 2022
Read Also:
NC22 | నాగచైతన్య సినిమాలో నేషనల్ అవార్డు విన్నింగ్ నటి?
Prince Movie | ‘ప్రిన్స్’ మూవీకి భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్.. వామ్మో అన్ని కోట్లా?
Mohan Babu | ఆ మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీని మోహన్‌బాబు రీమేక్ చేస్తున్నాడా?
Sai Rajesh | ‘హృదయ కాలేయం’ దర్శకుడికి లగ్జరీ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన మారుతి.. ధర ఎంతో తెలుసా?