Mega 158 | సంక్రాంతి 2027 రేసులో చిరంజీవి.. అనిల్ రావిపుడి సినిమాకు పోటీగా ‘మెగా 158’
Mega 158 | మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మెగా 158’ రెండవ షెడ్యూల్‌కు రంగం సిద్ధమైంది.
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మెగా 158’ రెండవ షెడ్యూల్‌కు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రబృందం ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో ఈ కీలక షెడ్యూల్ మొదలుకానుంది. మెగాస్టార్ చిరంజీవి ఈరోజు నుంచే సెట్స్‌లోకి అడుగుపెట్టి షూటింగ్లో పాల్గొననున్నారు. అయితే ఈ షెడ్యూల్లో మెగాస్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు కథకు కీలకమైన ఎమోషనల్ టాకీ పార్ట్‌ను కూడా తెరకెక్కించనున్నట్లు సమాచారం. దాదాపు నెల రోజుల పాటు నాన్‌స్టాప్‌గా జరిగే ఈ షెడ్యూల్ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు.
మరోవైపు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో, అభిమానుల్లో విపరీతమైన బజ్ నెలకొంది. సంక్రాంతి 2027 కానుకగా ‘మెగా 158’ను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ గట్టిగా డిసైడ్ అయ్యారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ ఎవరనేది ఇప్పటివరకు సస్పెన్స్‌గా ఉంచారు. అయితే ఈ సెకండ్ షెడ్యూల్ పూర్తయ్యేలోపే హీరోయిన్ను అధికారికంగా అనౌన్స్ చేసేందుకు కెవిఎన్ ప్రొడక్షన్స్ ప్లాన్ చేస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్‌కు ఉన్న పెద్ద సస్పెన్స్‌కు త్వరలోనే తెర పడనుంది. అయితే సంక్రాంతికి అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేశ్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం కూడా విడుదల కానుంది. మరి ఈ రెండు సినిమాలు క్లాష్ కాబోతున్నాయా అనేది చూడాల్సి ఉంది.
ఇక రాక్‌స్టార్ థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ మెగాస్టార్ కుమార్తె పాత్రలో కనిపించనుంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాబీ మార్క్ మాస్ ఎలిమెంట్స్, చిరంజీవి స్టైలిష్ యాక్షన్ అవతార్‌తో ‘మెగా 158’ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

