Chiranjeevi New Movie Title | చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ యువ హీరోలకు పోటీనిస్తున్నాడు. అప్పట్లో చిరంజీవికి ఎంత బిజీ షెడ్యూల్ ఉందో, ఇప్పుడు కూడా అంతే ఉంది. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇటీవలే చిరు ‘ఆచార్య’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ప్రేక్షకులనే కాదు మెగా ఆభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలో చిరు తన తదుపరి చిత్రాలపై పూర్తి దృష్టిని పెట్టాడు. ప్రస్తుతం చిరు రెండు సినిమా షూటింగ్‌లను ఏకకాలంలో జరుపుతున్నాడు. అందులో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఒకటి. కాగా చిత్రబృందం లేటెస్ట్గా మెగా అభిమానులతో ప్రెస్‌మీట్ నిర్వహించింది.
ప్రెస్మీట్లో భాగంగా దర్శకుడు బాబీ ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించాడు. ఈ చిత్రానికి గతంలో వాల్తేరు శ్రీను, వాల్తేరు వీరయ్య అనే రెండు టైటిల్స్‌ను పరిశీలనలో ఉంచినట్లు ప్రచారం జరిగింది. కాగా ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ను చివరిగా ఫిక్స్ చేశారు. ‘ముఠా మేస్త్రీ’ తరహా మాస్ యాంగిల్లో ఈ చిత్రం ఉండనున్నట్లు గతంలో విడుదలైన పోస్టర్లను చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రంలో చిరు అండర్‌కవర్ కాప్‌గా కనిపించనున్నాడు. విశాఖపట్నం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. మాస్రాజ రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం మెగాస్టార్‌కు 154వ సినిమాగా తెరకెక్కుతుంది.