Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ఏ మాత్రం తగ్గడం లేదు. కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన నటించిన విశ్వంభర చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ఇప్పుడు అనీల్ రావిపూడి ప్రాజెక్ట్‌ని లైన్లో పెట్టాడు. అయితే ఇప్పుడు అందరి దృష్టి చిరు- అనీల్ ప్రాజెక్ట్‌పైనే ఉంది. చిరంజీవి అల్లరిగా, కామెడీ టైమింగ్‌లో చూసి చాలాకాలం కాగా, మెగా 157 చిత్రంతో ఆ లోటుని భర్తీ చేస్తారట. ఈ చిత్రంలో అనీల్ మార్క్ ఫన్, ఫ్యామిలీ, ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ గా ఉండబోతున్నాయని తెలుస్తుంది.ఈ చిత్రం కోసం అనీల్ రావిపూడి పూర్తి విభిన్నమైన ట్రాక్‌ను ఎంచుకున్నట్లు సమాచారం.
అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకి ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభమైంది. ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో చిత్రీకరణ మొదలు కాగా, ఈ షెడ్యూల్లో ప్రధాన పాత్రలపై కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. చిరంజీవి ఈ మూవీ కోసం అధిక టైం కేటాయిస్తారట. ఒకే షెడ్యూల్లో అధిక భాగం చిత్రీకరణ పూర్తయ్యేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. 2026 సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనే లక్ష్యంతో మేకర్స్ షూటింగ్ షెడ్యూల్ ను స్పీడ్ మీద నడిపిస్తున్నారు.
మెగా 157 సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. చిత్రంలో చిరు పాత్రకు ప్రత్యేక గెటప్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. డిఫరెంట్ ట్రాక్ తో కూడిన ఈ కథ మాస్ ఆడియెన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎంతగానో అలరిస్తుందని అంటున్నారు. అనీల్ రావిపూడి కెరీర్లో ఒక్క అపజయం అనేది లేదు. ఇప్పుడు చిరు సినిమాతోను మంచి హిట్ కొట్టి తన ఖాతాలో మరో సక్సెస్ చేర్చుకోవాలని భావిస్తున్నాడు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన పలు చిత్రాలు ప్రేక్షకులని అలరించిన విషయం తెలిసిందే.