Chiranjeevi| మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత ఒక్క సూపర్ హిట్ కూడా అందుకోలేదు. ఆయన చేసిన సినిమాలన్నీ ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి విశ్వంభర సినిమాపైనే ఉంది. ఈ సినిమాతో చిరు బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని అనుకుంటున్నారు. ఒకవేళ ఇది మిస్ అయితే అనీల్ రావిపూడి సినిమాతో అయిన హిట్ కొట్టడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ముచ్చటించుకుంటున్నారు. అయితే చిరు- అనీల్ కాంబోలో రానున్న సినిమా కథ ఎలా ఉంటుందనే దానిపై ఇప్పుడు జోరుగా చర్చలు నడుస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన కథలు సినిమాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.
ఇప్పుడు ఆయన ఏ సినిమా చేసిన కూడా గతంలో చేసిన సినిమాతో కొంత లిక్ అయి ఉంటుంది. ఈ క్రమంలో పాత కథనే కాస్త మోడ్రన్ స్టైల్లో తెరకెక్కిస్తే ఎలా ఉంటుందని అనీల్ రావిపూడి అనుకుంటున్నాడట. చిరు కోసం ఓ మాస్ అండ్ ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు వినిపిస్తున్నాయి. 1989లో చిరంజీవి హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ తెలుగు సినిమా చరిత్రలో ఓ ల్యాండ్‌మార్క్ మూవీ కాగా, ఇది ఒక రివేంజ్ డ్రామా. ఇందులో అద్భుతమైన ఎమోషన్స్, పవర్ఫుల్ డైలాగ్స్, అల్లూరింగ్ మాస్ ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి. ఇప్పుడు ఇదే తరహాలో చిరుతో అనీల్ రావిపూడి ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడట.
చిరంజీవి సినిమాల్లో కామెడీ, మాస్, సెంటిమెంట్ మిక్స్ అయి ఉంటే అది సూపర్ హిట్టే. అందుకే తన సినిమా కథని అనీల్ రావిపూడి అలానే రాసుకుంటున్నాడట. సమ్మర్ తర్వాత ఇది సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా అదితి రావు హైదరీ పేరు పరిశీలనలో ఉంది. ఈమెతో పాటు ఐశ్వర్యా రాజేష్, శృతి హాసన్ పేర్లు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే తన టీమ్ తో కలిసి.. డైలాగ్ వెర్షన్ తో సహా ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ ను పూర్తి చేశాడట అనీల్ రావిపూడి . త్వరలోనే సెకండ్ హాఫ్ ని కూడా పూర్తి చేయనున్నారట. పక్కా ప్లానింగ్ తో వీలైనంత త్వరగా సినిమాని పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఇక ఈ మూవీ కోసం చిరంజీవి 90 రోజులు డేట్స్ కేటాయించారట. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి అక్టోబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తుంది.