ఏఐ, డీప్‌ఫేక్‌లకు అడ్డుకట్ట వేయండి..
అగ్ర హీరోలు చిరంజీవి, రామ్‌చరణ్ సోమవారం హైదరాబాద్‌లో కేంద్ర హోంమత్రి అమిత్‌షాను కలిశారు.
అగ్ర హీరోలు చిరంజీవి, రామ్‌చరణ్ సోమవారం హైదరాబాద్‌లో కేంద్ర హోంమత్రి అమిత్‌షాను కలిశారు. ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్ సమస్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ టెక్నాలజీలు దుర్వినియోగం అవుతున్న తీరును అమిత్‌షాకు వారు స్వయంగా వివరించారు. దీన్ని అరికట్టేందుకు మరింత పటిష్టమైన చర్యలు, కఠినమైన శిక్షలు అమలు చేయాలని వారిరువురూ కోరారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన అమిత్‌షా.. లిఖితపూర్వకంగా వినతిపత్రం సమర్పించాలని సూచించారు.
ఈ వ్యవహారాన్ని సమన్వయం చేసే బాధ్యతను జి.కిషన్‌రెడ్డికి అప్పగించారు. కేంద్ర హోంమంత్రి స్పందనకు చిరంజీవి, రామ్‌చరణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభించి, కళాకారులకు తగిన రక్షణ లభిస్తుందని వారు ఆశాభావం వెలిబుచ్చారు. కళాకారులను లక్ష్యంగా చేసుకొని అసభ్యకరమైన, మార్ఫింగ్ వీడియోలను రూపొందించడంపై ఇటీవల ఎక్స్ వేదికగా చిరంజీవి ఆందోళన వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

