ఇటీవలే తన తాజా చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. మరోవైపు కొత్త సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారాయన. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో చేయబోయే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన మంగళవారం వెలువడిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నారని గతకొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు చిరంజీవి ఓకే చెప్పారని తెలుస్తున్నది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత చిరంజీవి ప్రాజెక్ట్‌పై అనిల్ రావిపూడి వర్క్ మొదలుపెడతారని సమాచారం. షైన్‌స్క్రీన్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రథమార్థంలో మొదలవుతుందని తెలిసింది. ఇక వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ‘విశ్వంభర’ వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది.