Acharya in OTT | అనుకున్న తేదీ కంటే చాలా ముందుగా ఓటీటీలోకి ఆచార్య
Acharya Movie in OTT | మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా ఆచార్య. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రానికి దారుణమైన కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో దీని ప్రభావం తొలి రోజు నుంచే కలెక్షన్స్‌పై పడింది. దీంతో ఈ సినిమాను చెప్పిన తేదీ కంటే రెండు వారాలు ముందుగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. దీనివల్ల ఓ లాభం ఉంటుంది. ముందుగానే సినిమాను ఇచ్చేస్తే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ తిరిగి నిర్మాతలకు డబ్బులు చెల్లిస్తుంది. దీన్ని ఎర్లీ విండో ప్రాసెస్ అంటారు.
తెలుగులో రాధే శ్యామ్ సినిమాకు ఇది అప్లై అయింది. చెప్పిన తేదీ కంటే రెండు వారాలు ముందుగానే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో వచ్చేసింది. అందుకు గానూ నిర్మాతలకు రూ.25 కోట్లు అదనంగా చెల్లించింది అమెజాన్. ఇప్పుడు ఆచార్యకు కూడా ఇదే జరిగేలా కనిపిస్తుంది. ఈ సినిమాను నాలుగు వారాల తర్వాత విడుదల చేసేలా ముందుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు.. వస్తున్న వసూళ్లు చూసిన తర్వాత చిరంజీవి నిర్ణయం మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. పైగా ఈ సినిమా కోసం చిరు, చరణ్ తో పాటు కొరటాల కూడా ఒక్క రూపాయి రెమ్యునరేషన్ తీసుకోలేదని ముందు నుంచి చెప్పారు. మరి వీళ్లకు డబ్బులు రావాలంటే అమెజాన్ ప్రైమ్‌కు ముందుగానే సినిమాను ఇచ్చేస్తే కనీసం 10 కోట్లు అయినా వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది.
ఏప్రిల్ 29న విడుదలైన ఈ చిత్రం.. మే 30వ తేదీ కానీ జూన్ మొదటి వారంలో కానీ ఓటీటీలో విడుదల కానుందని ముందు నుంచి సమాచారం ఉంది. కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆచార్య మే 12న విడుదల కానుందని తెలుస్తుంది. అంటే కేవలం రెండు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీలో వచ్చేస్తుందన్నమాట. చిరు సినిమా కాబట్టి కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు. అమెజాన్ లో అయినా ఈ సినిమాకు మంచి అప్లాజ్ వస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. ఏదేమైనా ఆచార్య అనుకున్న దానికంటే ముందు రావడం అభిమానులకు మాత్రం సంతోషించదగ్గ విషయమే.
Read More :
“Regina Cassandra | హద్దులు దాటడంపై రెజీనా ఏం చెప్పుకొచ్చిందంటే..?”
“Pooja Hegde | బీస్ట్ సినిమాలో విజయ్‌తో నటించడంపై పూజా హెగ్డే రియాక్షన్ ఏంటి?”
“రిటైర్మెంట్ పై ఆ అగ్ర దర్శకుడు ఇంకా మనసు మార్చుకోలేదా..?”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Acharya
- Chiranjeevi
- ott
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

