Pooja Hegde | బీస్ట్ సినిమాలో విజయ్‌తో నటించడంపై పూజా హెగ్డే రియాక్షన్ ఏంటి?
Pooja Hegde | ఓ హీరో ఆమె కాళ్లను చూసి ప్రేమలో పడతాడు. ఒక హీరో ఆమె కళ్లతో కబుర్లాడతాడు. ఒక హీరో నవ్వుతోనే లవ్వులో పడిపోతాడు. గోపికమ్మగా ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలతో టాలీవుడ్లో స్థిరపడిపోయింది పూజా హెగ్డే. తెరంగేట్రం చేసి పదేండ్లవుతున్నా చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్నది పూజ. ఆ ‘పాన్ ఇండియా స్టార్’తో సినిమా ముచ్చట్లు..
ఫస్ట్ థ్యాంక్స్ అమ్మకే
చిన్నప్పటి నుంచీ నేను సిగ్గరినే. ఎవరితోనూ పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. ఆ బెరుకు పోగొట్టడానికే అమ్మ నన్ను క్లాసికల్ డ్యాన్స్ స్కూల్లో చేర్పించింది. పదేండ్లు భరతనాట్యం నేర్చుకున్నా. స్టేజ్ ఫియర్ పోవడానికి నృత్యం చాలా ఉపయోగ పడింది. క్లాసికల్ రావడం వల్ల వెస్ట్రన్ సులభం అయింది. ప్రస్తుతం, నా డ్యాన్స్‌ను అందరూ మెచ్చుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. హృతిక్ రోషన్, అల్లు అర్జున్, విజయ్ వంటి సూపర్ డ్యాన్సర్లతో చేయగలుగుతున్నానంటే ఆ క్రెడిట్ అమ్మదే.
ఎప్పుడూ అనుకోలేదు..
నాకు చదువంటే పెద్దగా పడేది కాదు. స్కూల్, కాలేజీ సాంస్కృతిక కార్యక్రమాల్లో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. హీరోయిన్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. మా కాలేజీ ఫంక్షన్లో ఎవరో నన్ను ‘మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంటావా?’ అని అడిగారు. ‘నన్నేనా?’ అని ఆశ్చర్యపోయా. 2009లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నా. ఆ తర్వాత మూడేళ్లకు సినిమా అవకాశం వచ్చింది.
నిజానికి ఐదేండ్లే..
నేను సినిమాల్లోకి వచ్చి పదేండ్లు అవుతున్నదంటే నమ్మబుద్ధి కావడం లేదు. నా అసలైన సినీ ప్రయాణం హరీష్ శంకర్‌గారి ‘డీజే- దువ్వాడ జగన్నాథం’తోనే మొదలైంది. ఈ రెండున్నరేండ్ల నుంచీ కరోనా కారణంగా సినిమాలన్నీ ఆగిపోయాయి. అందుకే నా వరకు ఐదేండ్లే అనిపిస్తుంది. ఈ పదేండ్లలో 14 సినిమాలు విడుదలయ్యాయి. మరో ఐదు చేతిలో ఉన్నాయి. హ్యాపీహ్యాపీగా ఉన్నా.
అన్నీ పెద్ద ప్రాజెక్టులే..
‘ఆచార్య’లో రామ్ చరణ్‌కు జోడిగా చేశాను. ‘నీలాంబరి’ చాలా అమాయక అమ్మాయి పాత్ర. ఆ క్యారెక్టర్ అందరికీ నచ్చింది. హిందీలో రణ్వీర్ సింగ్, సల్మాన్ ఖాన్ హీరోలుగా రెండు సినిమాల్లో చేస్తున్నా. త్రివిక్రమ్, మహేశ్‌బాబు కాంబినేషన్లో ఓ ప్రాజెక్టుకు సంతకం చేశాను.
అందరూ స్పెషలే..
నేను వర్క్ చేసిన హీరోలంతా నాకు ప్రత్యేకమే. విజయ్‌తో ‘బీస్ట్’లో చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. అంత పెద్ద స్టార్ అయినా చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నా. అల్లు అర్జున్, మహేశ్ బాబు, వరుణ్, ప్రభాస్, హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్.. ఇలా ఒక్కరేంటి నా కోస్టార్స్ అందరి నుంచీ ఏదో ఒకటి నేర్చుకున్నా.
నాకు ప్రయాణాలు ఇష్టం..
నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఏదో ఒక ట్రిప్‌కి వెళతాను. కొత్త ప్రదేశాల్లో తిరగడం వల్ల ఆయా ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయి. ప్రయాణాల్లో ఎంతోమందితో ఆలోచనలు పంచుకుంటాను. ఎక్కువగా చల్లని ప్రదేశాలను ఇష్టపడతాను.
నచ్చింది తినేయడమే..
నచ్చింది కడుపు నిండా తినడమే నాకిష్టం. ప్రత్యేకమైన డైట్ అంటూ లేదు. కానీ ఏం తిన్నా, ఎంత తిన్నా వ్యాయామం మాత్రం తప్పకుండా చేస్తాను. ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇస్తాను. ఎక్కడికెళితే అక్కడికి కుక్‌ను తీసుకెళ్తాను. తగినంత నిద్ర లేకపోతే, ఏ పనీ సక్రమంగా చేయలేం. ఎంతటి బిజీ షెడ్యూల్ అయినా, రాత్రి పదకొండు కొట్టగానే ప్రపంచానికి గుడ్ నైట్ చెప్తా.
Read More :
“Pooja Hegde Remuneration | పేమెంట్‌ను బీట్ చేసింది..మరి గ్లామర్ డోస్ సంగతేంటి..?”
నత్తగుల్లలు లొట్టలేసుకుంటూ తింటానంటున్న పూజా హెగ్డే.. బుట్ట బొమ్మ ఇష్టమైన ఫుడ్ ఏంటంటే..”
Pooja Hegde | చిలుకపచ్చ చీరలో కేకపెట్టిస్తున్న పూజా హెగ్డే..”
Pooja Hegde item song | టాప్ ఫామ్‌లో ఉన్నపుడే ఐటమ్ సాంగ్స్ చేసిన హీరోయిన్లు వీళ్లే.”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

